Ads
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తెరపై కనిపిస్తే చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూశారు. అంతకుముందు మగధీర సినిమాలో, ఆ తర్వాత బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి చిన్న పాత్రలో కనిపించారు. అలా కాకుండా వారిద్దరూ కలిసి ఒక ఫుల్ లెంత్ సినిమాలో నటించాలి అని అందరూ అనుకున్నారు.
Video Advertisement
ఆచార్య సినిమాతో అది జరుగుతుంది అని తెలిసాక అసలు సినిమా ఎలా ఉండబోతోంది? ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయా? అని అనుకున్నారు. కానీ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు అని చెప్పాలి.
సినిమా ట్రైలర్ విడుదల అయిన తర్వాత సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోందో అనే ఆందోళన అందరిలో నెలకొంది. ఎందుకంటే ఈ ట్రైలర్ లో కొత్తగా కనిపించిన అంశాలు ఏమీ లేవు. కానీ ఈ సినిమా విడుదల అయిన తర్వాత వేరుగా ఉండొచ్చు ఏమో అని అనుకున్నారు. అలా జరగలేదు. విడుదల అయిన తర్వాత నుంచి సినిమాపై నెగిటివ్ టాక్ రావడం మొదలయ్యింది. సోషల్ మీడియాలో సినిమా గురించి నెగిటివ్ స్పందన వచ్చింది. సాధారణంగా చాలా మంది ప్రేక్షకులు సినిమా చూసే ముందు సోషల్ మీడియాలో ఆ సినిమాకి సంబంధించిన టాక్స్ చూస్తారు.
దాంతో సినిమా ఎలా ఉంది అనే విషయం అర్థం అయిపోయింది. అంతే కాకుండా టాక్ వచ్చిన కొంచెం సేపటి తర్వాత సినిమాపై ట్రోల్స్ రావడం మొదలయ్యాయి. కొన్ని సీన్స్ ని అయితే విపరీతంగా ట్రోల్ చేశారు. ఇది కూడా సినిమాపై చాలా ప్రభావం చూపింది. దాంతో ఇవన్నీ చూసిన ప్రేక్షకులు సినిమా ఇలా ఉంటే మళ్ళీ వెళ్లడం ఎందుకు అని అనుకొని ఆగిపోయారు. అంతే కాకుండా సినిమా ప్రమోషన్స్ కూడా పెద్దగా జరగలేదు. ఈ సంవత్సరం విడుదలైన పెద్ద హీరోల సినిమాలకి చాలా ప్రమోషన్స్ జరిగాయి. ఈ సినిమా విషయంలో మాత్రం అలా జరగలేదు. దాంతో ప్రమోషన్స్ బాగా ఉండి ఉంటే సినిమా రిజల్ట్ యావరేజ్ అయ్యి ఉండేది ఏమో అని అంటున్నారు.
End of Article