లీక్ అయిన “పుష్ప – ద రూల్” మెయిన్ ట్విస్ట్..! అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా..?

లీక్ అయిన “పుష్ప – ద రూల్” మెయిన్ ట్విస్ట్..! అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా..?

by Mohana Priya

Ads

ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.

Video Advertisement

దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తో సహా అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

reasons behind pushpa negative talk

పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయినప్పటికంటే, ఇప్పుడే చాలా మంచి టాక్ వస్తోంది. ఎంతో మంది సెలబ్రిటీలు సినిమా చూసి, సినిమా చాలా బాగుంది అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని సోషల్ మీడియా ద్వారా పొగుడుతున్నారు. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు మాత్రమే కాకుండా, బాలీవుడ్ కి సంబంధించిన ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ నటనని ప్రశంసించారు. దాంతో పుష్ప రెండవ పార్ట్ విడుదలకి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

van mistake in pushpa movie

పుష్ప రెండవ భాగం కథా విషయంలో చాలా మార్పులు చేసినట్టు సమాచారం. సినిమా కేవలం తెలుగులో కాకుండా హిందీలో కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. అందుకే సౌత్ కాకుండా నార్త్ ఆడియన్స్ ని కూడా దృష్టిలో పెట్టుకొని సెకండ్ పార్ట్ కథ రాసుకుంటున్నారు. అంతకుముందు రాసుకున్న కథలో ఒక్కరే విలన్ ఉన్నారు. కానీ ఇప్పుడు మరో విలన్ కూడా ఉండబోతున్నారు. ఆ పాత్ర కోసం ఒక పెద్ద పేరున్న బాలీవుడ్ నటుడిని అనుకుంటున్నారట. అంతే కాకుండా ఇంకో ట్విస్ట్ ఏంటంటే పుష్ప పక్కనే ఉంటూ, పుష్పకి అన్నిట్లో సహాయం చేసిన కేశవ సెకండ్ పార్ట్‌లో హీరోకి యాంటీ అవుతాడట. హీరోకి చాలా సమస్యలు కేశవ పాత్ర వల్లే వస్తాయట. ఈ వార్త అయితే ప్రస్తుతం వైరల్ అవుతోంది. సినిమా బృందం ప్రస్తుతం కథా చర్చల్లో ఉంది.


End of Article

You may also like