F4 సినిమా విషయంలో “అనిల్ రావిపూడి” ఇంత పెద్ద మార్పు చేయబోతున్నారా..? ఇలా చేస్తే వర్కౌట్ అవుతుందా..?

F4 సినిమా విషయంలో “అనిల్ రావిపూడి” ఇంత పెద్ద మార్పు చేయబోతున్నారా..? ఇలా చేస్తే వర్కౌట్ అవుతుందా..?

by Sunku Sravan

Ads

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇప్పటికే f2, f3 సినిమాలు వచ్చి సంచలన విజయాన్ని అందుకున్నాయి.

Video Advertisement

ఈ తరుణంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ f4 సినిమా కూడా తెరకెక్కించే అవకాశం ఉందని అన్నారు.  ఈ క్రమంలో f4 సినిమాలో వెంకటేష్ మరియు వరుణ్ తేజలు కనిపించరని సోషల్ మీడియా మరియు వెబ్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది.

F2సినిమాకు వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ ల పారితోషికాల పోల్చిచూస్తే, f3 లో ఎక్కువగా తీసుకున్నారని దీంతో సినిమాకు బడ్జెట్ బాగా ఖర్చు అయింది అని వార్తలు కూడా వచ్చాయి. ఈ సందర్భంలోనే f4 సినిమాకు కూడా బడ్జెట్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణాల వల్ల f4 సినిమా తెరకెక్కిస్తే మాత్రం ఈ మూవీలో వేరే హీరోలను తీసుకునే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది.

అయితే వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ కామెడీ టైమింగ్ వల్లే ఎఫ్ 3 మూవీ విజయవంతమైంది. అయితే f4 సినిమాలో ఈ హీరోలు లేకుండా తెరకెక్కిస్తే సినిమా రిజల్ట్ పై ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉండవచ్చని చెప్పవచ్చు. కానీ దిల్ రాజ్ అనిల్ రావిపూడి ఈ విషయంలో తప్పు చేయరని నెటిజన్లు అంటున్నారు. అయితే అనిల్ రావిపూడి ఇప్పటికే ఎన్నో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఆ సినిమాలు అన్ని పూర్తి అయిన తర్వాతనే f4 సినిమాపై దృష్టి పెట్టనున్నారు. దీనిపై దర్శకుడు అనిల్ క్లారిటీ ఇస్తే కానీ సమాధానం దొరికే అవకాశం లేదు. ఈ విధంగా డబుల్ హాట్రిక్ సాధించడంతో అనిల్ రావిపూడి రేంజ్ కూడా పెరిగింది. అలాంటి దర్శకుడు తర్వాత ప్రాజెక్టులలో సంచలన విజయాలు అందుకోవాలని ఫాన్స్ ఆశిస్తున్నారు.


End of Article

You may also like