పెళ్లి తో ప్రతి ఒక్కరి జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. పెళ్లి తర్వాత ఒకరికి తోడు దొరుకుతుంది. కలకాలం కలిసి ఆ వ్యక్తి తో జీవితాంతం ఆనందంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. పెళ్లి అంటే వధువు ఎంతో అందంగా ముస్తాబు అవుతుంది వరుడు ఖరీదైన దుస్తులు ధరించినప్పటికీ వధువు విషయంలో చాలా ఉంటాయి.

Video Advertisement

చీరలు నగలు మొదలు మేకప్ దాకా వధువులు శ్రద్ధ పెడతారు. బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేషియల్ వంటివి చేయించుకుంటూ ఉంటారు. బ్రైడల్ మేకప్ వంటివి పార్లర్ వాళ్ళు అందిస్తారు. ఇటువంటి మేకప్స్ తో చాలా అందంగా కనపడొచ్చు.

ఫోటోలు లో కూడా బాగా కనపడతారు అని చాలా మంది బ్యూటీ పార్లర్ కి వెళ్లి ముందు నుండి వారికి నచ్చిన వాటిని చేయించుకుంటూ ఉంటారు. అందరి వధువుల్లాగే ఈ వధువు కూడా గంటలో పెళ్లి అనగా బ్యూటీ పార్లర్ కి వెళ్లి వచ్చింది తీరా చూస్తే ఆమె మొఖం వికృతంగా మారి పోయింది. దీనితో పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది. వివరాల్లోకి వెళితే… కర్ణాటకలోని హస్సాన్ జిల్లా లోని అర్సికేరేలో జాజూర్ గ్రామానికి చెందిన ఒక ఆమె కి పెళ్లి కుదిరింది.

గంట లో పెళ్లి కట్ చేస్తే మేకప్ కోసమని గంగాశ్రీ హెర్బల్ పార్లర్ అండ్ స్పాకు వధువు వెళ్ళింది. వచ్చి చూస్తే ముఖం కందిపోయి నల్లగా మారి ఉబ్బి పోయింది. మేకప్ ఏ కారణం అని తెలుసుకుంది. ఇంటికి వచ్చాక బంధువులు కూడా షాక్ అయ్యారు. ఆమె ని చూసి వరుడు భయపడ్డాడు. కొత్త మేకప్ అని పార్లర్ ఆవిడ చెప్పిందట. వరుడు మాత్రం పెళ్లి ని క్యాన్సిల్ చేసేసాడు. మేకప్ వికటించడం తో ఐసియు లో చికిత్స తీసుకుంటోంది వధువు. బ్యూటీషియన్ పై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు బ్యూటీషియన్‌ను విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది.