Ads
తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శనివారం మొదటి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా, తర్వాత మంత్రులు, తర్వాత బిఆర్ఎస్ నాయకులు ప్రమాణస్వీకారం చేశారు. అయితే ప్రమాణస్వీకారం కార్యక్రమానికి కేటీఆర్ హాజరు కాలేదు. కెసిఆర్ ఆపరేషన్ నిమిత్తం ఆయన వద్ద ఉండటంతో హాజరు కాలేకపోతున్నానని తెలియజేశారు. అలాగే ప్రమాణ స్వీకరానికి బీజేపీ సభ్యులు ఎవరు హాజరు కాలేదు. తాము అక్బరుద్దీన్ ఎదుట ప్రమాణం చేయమని తెలియజేశారు. స్పీకర్ వచ్చిన తర్వాతే తాము ప్రమాణ స్వీకారానికి హాజరవుతామని తెలిపారు.
Video Advertisement
అయితే ఈ సమావేశాలకి ఎమ్మెల్యేలు అందరూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అసెంబ్లీ వద్ద పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫుల్ టైట్ సెక్యూరిటీలో ప్రజలు ఎవ్వరిని అటువైపు రానివ్వకుండా ట్రాఫిక్ మళ్లింపు కూడా చేశారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో రామగుండం ఎమ్మెల్యే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ న్యూ లుక్ లో అసెంబ్లీకి వచ్చారు.
తట్టా చెమ్మస్ తో బ్లూ కలర్ డ్రెస్ తో ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చారు. సింగరేణి కార్మికుడి వేషధారణలో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేని అందరూ ప్రత్యేకంగా చూస్తున్నారు. తాను కూడా సింగరేణి కార్మికుడిని అని గుర్తు చేస్తూ ఎమ్మెల్యే అసెంబ్లీకి రావడం కార్మికులకు ఆనందం కలిగించే విషయమే. మరోపక్క ఈరోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజు కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ సంబరాల్లో మునిగిపోయారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఈ రోజే ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఈ పథకం వర్తించనుంది.
End of Article