Home Biography ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారిన ఆమె ఫొటోలు…ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు..!!

ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారిన ఆమె ఫొటోలు…ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు..!!

by Mohana Priya

ఎన్నో సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తూ మలయాళం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మంజు వారియర్. మంజు వారియర్ 1995 లో వచ్చిన సాక్ష్యం అనే మలయాళ సినిమాతో తన సినిమా కెరీర్ ని మొదలు పెట్టారు. అప్పటికి మంజు వారియర్ వయసు దాదాపు 17 సంవత్సరాలు. ఆ తర్వాత ఎన్నో మలయాళం సినిమాల్లో నటించారు. మంజు వారియర్ మంచి డాన్సర్ కూడా. తన డాన్స్ కి ఎన్నో అవార్డులను అందుకున్నారు.

malayalam actress manju warrier latest pictures going viral

17 సంవత్సరాలకి తన కెరీర్ ని మొదలు పెట్టిన మంజు వారియర్, 18 సంవత్సరాల అప్పుడు సల్లప్పం అనే సినిమాలో నటించారు. ఆ సినిమాలో హీరోగా నటించిన దిలీప్ ని 1998లో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ మీనాక్షి అనే పాప కూడా ఉంది. పెళ్లయిన తర్వాత మంజు వారియర్ ఎక్కువగా సినిమాలు చేయలేదు. 2012 లో గురువాయుర్ శ్రీ కృష్ణ ఆలయంలో కూచిపూడి ప్రదర్శన ఇచ్చారు మంజు వారియర్.

malayalam actress manju warrier latest pictures going viral

2013 లో కళ్యాణ్ జువెలర్స్ అడ్వర్టైజ్మెంట్ లో అమితాబ్ బచ్చన్ గారు, ఐశ్వర్య రాయ్, అక్కినేని నాగార్జున, ప్రభు, శివ రాజ్ కుమార్ లతో కలిసి నటించారు. 2014లో మంజు వారియర్, దిలీప్ విడిపోయారు. అప్పుడు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో వచ్చిన హౌ ఓల్డ్ ఆర్ యు అనే సినిమాతో కంబ్యాక్ ఇచ్చారు మంజు వారియర్. ఆ తర్వాత నుంచీ ఎన్నో మలయాళ సినిమాల్లో నటించారు.

malayalam actress manju warrier latest pictures going viral

అలాగే 2019 లో ధనుష్ హీరోగా వచ్చిన అసురన్ సినిమాలో నటించారు మంజు వారియర్. అసురన్ మంజు వారియర్ మొదటి తమిళ్ సినిమా. ప్రస్తుతం మంజు వారియర్ నటించిన కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా ఇంకొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. మంజు వారియర్ వయసు ఇప్పుడు 42 సంవత్సరాలు.

malayalam actress manju warrier latest pictures going viral

అయితే, ఇటీవల మంజు వారియర్ ఒక ఈవెంట్ కి హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో మంజు వారియర్ ని చూసిన వారందరూ “ఈమెకి 42 సంవత్సరాలు అంటే అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు!” అని అనుకున్నారు. అంత యంగ్ గా కనిపించారు. ప్రస్తుతం ఆ ఈవెంట్ లో మంజు వారియర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

malayalam actress manju warrier latest pictures going viral

malayalam actress manju warrier latest pictures going viral

You may also like