Ads
కాలేజ్ లో కలిసి చదువుకుని, ప్రేమించుకొని, పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ తర్వాత జరిగిన ఘటన ప్రస్తుతం చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే, న్యూస్18 తెలుగు కథనం ప్రకారం ఒడిశాలోని పురుషోత్తం పూర్ పోలీస్ స్టేషన్ పరిధి పత్తపూర్ గ్రామానికి చెందిన కృష్ణ చంద్ర సాహూ అనే 30 సంవత్సరాల యువకుడు, కభిసూర్య నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జొలంబో గ్రామానికి చెందిన 25 సంవత్సరాల యువతి సుస్మిత బరంపురం కళాశాలలో మూడు ఏళ్ళు కలిసి చదువుకున్నారు.
Video Advertisement
ప్రస్తుతం కృష్ణ చంద్ర ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. సుస్మిత భంజనగర్ సమీపంలో ఉన్న ముజాగడలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నారు. ప్రేమ పేరుతో తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మబలికి సుస్మితని లైంగికంగా దగ్గర చేసుకున్నాడు. తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని సుస్మిత తరచూ ఒత్తిడి తీసుకురావడంతో కృష్ణ చంద్ర ఒక పథకం వేశాడు.
ఒకరోజు ఆమెను తన గ్రామానికి రమ్మని పిలిచి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ మంటలను గమనించిన చుట్టుపక్కల వాళ్ళు అందించిన సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ముందు పురుషోత్తం పూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం బరంపురం లోని ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లారు.
చికిత్స పొందుతూ సుస్మిత మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. సుస్మిత తన మరణ వాంగ్మూలంలో “తనని కృష్ణ చంద్ర ప్రతాపపూర్ కి రమ్మని పిలిచి, అక్కడ గ్రామంలోని ఒక నస్యం పరిశ్రమలో తనపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు అని అన్నారు” అని పురుషోత్తంపూర్ ఎస్డీపీఓ సూర్యమణి ప్రధాన్
చెప్పారు. ఘటనా స్థలంలో రెండు రెక్టిఫైడ్ స్పిరిట్ సీసాలు, పెట్రోల్ బాటిల్, యువతి పాదరక్షలు, అగ్గిపెట్ట స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
representative image
సుస్మిత తల్లిదండ్రులు, కృష్ణ చంద్ర తమ కూతురిని హతమార్చాడు అని చెప్పారు. పోలీస్ స్టేషన్ లో విలేకరులతో మాట్లాడుతూ సుష్మిత హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ సంఘటన చోటు చేసుకున్న సమయంలో పురుషోత్తం పని చేస్తున్నాను అని చెప్పాడు. గ్రామస్తులు ఫోన్ చేసి తనకి ఈ విషయం చెప్పారు అని చెప్పాడు.
representative image
ఐదు సంవత్సరాలుగా వారిద్దరూ ప్రేమించుకున్నామని, రెండు సంవత్సరాల కిందట మనస్పర్థలు వచ్చాయని అన్నారు. అయితే కృష్ణ చంద్ర కి అంతకుముందు వివాహం అయింది అని తెలిసింది. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు అన్నారు.
End of Article