రూ.23 లక్షలకు గుర్రం… ఇంటికి తీసికెళ్ళాక అసలు స్టోరీ బయటపడింది.. ఏమైందంటే..?

రూ.23 లక్షలకు గుర్రం… ఇంటికి తీసికెళ్ళాక అసలు స్టోరీ బయటపడింది.. ఏమైందంటే..?

by Megha Varna

Ads

ఎప్పుడైనా సరే ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ఎవరి సలహా అయినా తీసుకోవడం లేదంటే ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవడం లాంటివి చేయాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ తో నాకు తెలుసులే అని వెళ్ళిపోతే అంతే సంగతులు. అయితే ఈ వ్యక్తి గుర్రాన్ని ఏకంగా 23 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేశాడు.

Video Advertisement

మేలుజాతి గుర్రాల ఉత్పత్తికి సంబంధించిన స్టడ్ ఫాంలపై పెట్టుబడి పెట్టాలని అనుకున్నాడు. తర్వాత గుర్రాన్ని కొని ఇంటికి తీసుకు వచ్చి స్నానం చేయించాడు. ఇంకేముంది వెంటనే షాక్ తిన్నాడు.

మరి ఇక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లాకు చెందిన రమేశ్ సింగ్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. గుర్రాల పెంపకంపై ఆసక్తి ఉండడంతో గుర్రం కొనాలనుకున్నాడు. అయితే లెహర్ కలాన్ గ్రామానికి చెందిన లచ్రా ఖాన్ అనే వ్యక్తి మరియు అతని స్నేహితులు రమేష్ కి పరిచయమయ్యారు.

వాళ్ల దగ్గర అరుదైన నల్ల మార్వాడి గుర్రం ఉందని తెలిసింది. 23 లక్షల రూపాయలని పెట్టి దానిని కొంటే ఐదు లక్షల లాభం వస్తుందని చెప్పారు. దీంతో రమేష్ సింగ్ 23 లక్షలు పెట్టి ఆ గుర్రాన్ని కొని ఇంటికి తీసుకు వచ్చాడు. అక్కడి దాకా అంతా బాగానే ఉంది. స్నానం చేయించిన తర్వాత అసలు స్టోరీ బయటపడింది.

స్నానం చేయించిన తర్వాత నలుపురంగు మొత్తం పోయి గోధుమరంగు బయటపడింది. దీంతో రమేష్ సింగ్ షాక్ అయ్యాడు. సాధారణ గుర్రాన్ని అంటగట్టి మేలుజాతి గుర్రం అని చెప్పారు. దీంతో వెంటనే పోలీసుల్ని ఆశ్రయించాడు రమేష్. తాను మేలుజాతి గుర్రాల పై పెట్టుబడి పెట్టాలని అనుకున్నానని కానీ వీళ్ల వల్ల మోసపోయానని పోలీసులకు చెప్పాడు. పలువురుని ఇలాగే నమ్మించి నిందితులు గుర్రాలని విక్రయించినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.


End of Article

You may also like