Ads
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మందికి సహాయం అవసరం ఉంది. దాంతో ఎంతో మంది తమకు చేతనైనంత సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. డబ్బు కానీ, లేదా ఇంకేదైనా అవసరానికి కానీ సహాయం అందించడానికి ఎంతో మంది ముందుకు వస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో కూడా కొంత మంది సహాయం చేస్తామని చెప్పి నమ్మించి మోసం చేస్తున్నారు.
Video Advertisement
image credits: news18
వివరాల్లోకి వెళితే, న్యూస్18 తెలుగు కథనం ప్రకారం ముంబైలోని బోరివలి వెస్ట్ కి చెందిన రూపేష్ మోహిత్ బ్లాక్ ఫంగస్ చికిత్సకు వినియోగిస్తున్న యాంఫోటెరిసిన్-బీ ఇంజెక్షన్ల కొరత ఉందని గుర్తించాడు. ఇంజెక్షన్లని బ్లాక్ లో అమ్ముతాను అని, తనకు తెలిసిన ఫ్రెండ్స్ లో చాలా మందికి చెప్పాడు. ఎవరైనా ఈ ఇంజక్షన్స్ కోసం అవసరం అయిన వాళ్ళు ఉంటే తన నంబర్ ఇవ్వమని చెప్పాడు.
ఈ క్రమంలో రౌనక్ అగర్వాల్ అనే వ్యక్తి తన 41 సంవత్సరాల అంకుల్ కి బ్లాక్ ఫంగస్ సోకడంతో ఇండోర్ లోని డిఎస్ఎస్ హాస్పిటల్ లో చేర్పించారు. రౌనక్ ఫ్రెండ్ ఒకరు మోహిత్ నెంబర్ ఇచ్చి తన దగ్గర ఇంజక్షన్స్ ఉన్నాయని అయితే బ్లాక్ లో అమ్ముతున్నాడు అని చెప్పారు. అత్యవసర పరిస్థితి అవ్వడంతో ఎంతైనా పర్లేదు అనుకొని మోహిత్ కి కాల్ చేశాడు రౌనక్. ఒక్కొక్క డోస్ 6000 అవుతుందని మోహిత్ చెప్పాడు.
డాక్టర్లు తనతో 60 డోస్ ల ఇంజక్షన్స్ కావాలి అని చెప్పడంతో మోహిత్ తాను ఎన్ని ఇంజక్షన్లు అయినా అమ్ముతాను అని, కానీ మొత్తం డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పాడు. దాంతో లక్షా ఎనభై వేల రూపాయలను అడ్వాన్స్ గా మోహిత్ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. రౌనక్ అంకుల్ పరిస్థితి రోజురోజుకి విషమిస్తుండడంతో ఇంజక్షన్స్ పంపాలని మోహిత్ ని అడిగాడు.
అందుకు మోహిత్ “రేపు పంపుతాను, తర్వాత పంపుతాను” అని చెప్పి దాటవేశాడు. మోహిత్ కి మే 25వ తేదీన డబ్బులు పంపగా మే 27వ తేదీన ఇంజక్షన్స్ ఇస్తాను అని చెప్పాడు అని, కానీ ఆ రోజు ఫోన్ చేస్తే ఆలస్యం అయ్యేలా ఉంది అని ఏవేవో సాకులు చెప్పాడు అని దాంతో తాను మోసపోయినట్లు గ్రహించాను అని రౌనక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తనకు ఇంజెక్షన్స్ వద్దు అని, తనకు డబ్బు తనకు తిరిగి ఇచ్చేయాలని మోహిత్ ని అడిగితే, అందుకు తాను నిరాకరించాడు అని చెప్పాడు. పోలీసులు రౌనక్ ఫిర్యాదు మేరకు మోహిత్ పై చీటింగ్ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మోహిత్ ని డబ్బు ఏది అని అడిగితే, పెళ్లి ఖర్చులకు వాడుకున్నాను అని చెప్పాడు. ఇలా మోహిత్ మరో ఇద్దరు, ముగ్గురుని కూడా మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
End of Article