కొంతకాలంగా ప్రేమ…పెళ్లి చేసుకుందామని అడిగేసరికి.? అసలు ఏమైంది అంటే.?

కొంతకాలంగా ప్రేమ…పెళ్లి చేసుకుందామని అడిగేసరికి.? అసలు ఏమైంది అంటే.?

by Mohana Priya

Ads

హైదరాబాద్ లోని బీకే గూడ వెంకటేశ్వర టెంపుల్‌ వీధిలో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం చర్చల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే న్యూస్ 18 తెలుగు కథనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీ పాలెం గ్రామానికి చెందిన గొర్రె సుధాకర్ అనే వ్యక్తి ఐదేళ్ల క్రితం హైదరాబాద్ కి వచ్చారు. బీకే గూడ వెంకటేశ్వర టెంపుల్ వీధిలో ఫ్రెండ్ భార్గవ్ తో కలిసి ఉంటున్నారు.

Video Advertisement

Man ends his life due to love failure

కొంత కాలంగా సుధాకర్ ఒక అమ్మాయిని ప్రేమించారు. ఇటీవల పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ఆ అమ్మాయి అందుకు నిరాకరించారు. దాంతో సుధాకర్ మనస్తాపానికి గురయ్యారు. దాంతో ఉంటున్న అద్దె ఇంట్లో ఉరేసుకొని శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదే రోజు రాత్రి భార్గవ్ వచ్చి తలుపులు తట్టారు. సుధాకర్ తీయలేదు. దాంతో భార్గవ్ కిరాణా షాప్ కి వెళ్లి పడుకున్నారు.

తెల్లవారుజామున తిరిగి రూమ్ వద్దకు వచ్చారు భార్గవ్. అప్పుడు కూడా సుధాకర్ తలుపు తీయకపోవడంతో పై పోర్షన్ లోకి వెళ్లి బాల్కనీ ద్వారా గదిలోకి వెళ్లి చూడగా సుధాకర్ ఉరికి వేలాడుతూ కనిపించారు. దాంతో భార్గవ్ పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. అయితే, చనిపోయే ముందు సెల్ ఫోన్ లో సుధాకర్ తీసుకున్న సెల్ఫీ వీడియోను పోలీసులు గుర్తించారు.

అందులో సుధాకర్ “నిన్ను నేను ప్రేమించాను. నా ప్రేమని నువ్వు నమ్మడం లేదు. నేను చనిపోతే అయినా నాది నిజమైన ప్రేమ అని నువ్వు తెలుసుకుంటావు” అని చెప్పారు. దాంతో ప్రేమ విఫలం అవడంతో సుధాకర్ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సుధాకర్ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


End of Article

You may also like