వైర్ ని తగులుకుని గాల్లో ఎగిరి మహిళ మీద పడ్డ ఆటో డ్రైవర్..సీసీటీవీ ఫుటేజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

వైర్ ని తగులుకుని గాల్లో ఎగిరి మహిళ మీద పడ్డ ఆటో డ్రైవర్..సీసీటీవీ ఫుటేజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

by Megha Varna

Ads

నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీస్తుంది. తాజాగా ఇలాంటి నిర్లక్ష్యమే ఒక ప్రమాదానికి కారణమైంది. అక్కడే ఉన్న సీసీటీవీలో ఈ ఘటన తాలూకు ఫుటేజ్ రికార్డ్ కావడంతో ఈ ప్రమాదం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Video Advertisement

ఈ వీడియోలో ఉన్న ఉదంతం ప్రకారం కేబుల్ వైర్ తెగింది రోడ్డు మీద పడి ఉంది దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈ సమయంలో అక్కడే ఆటో పక్కన నిలబడిన ఆటోడ్రైవర్ పక్కనే కేబుల్ వైర్ ట్రాక్టర్ కు తగులుకోవడంతో అతడు గాలిలో ఎగురుకుంటూ వెళ్లి ఫుట్ పాత్ మీద వెళుతున్న ఒక స్త్రీ పై పడ్డాడు. దాంతో ఇద్దరికీ గాయాలయ్యాయి.ఆ మహిళ పేరు సునీత అని ఈ తతంగం నగరంలోని కృష్ణరాజపురంలో చోటు చేసుకుందనే విషయం తాజాగా బయటపడింది.

దీనితో ఈ తతంగం ఎక్కడ జరిగిందో క్లారిటీ వచ్చేసింది.ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన వారంతా అదృష్టవశాత్తు ఇద్దరూ గాయాలతో బయటపడ్డారు. లేకుంటే ప్రాణాలు పోయేవి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఆ వైరల్ అవుతున్న వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

watch video:


End of Article

You may also like