Ads
ఫిలిప్పీన్స్ లో ఒక పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్ళి కూతురు పెళ్లి వెన్యూ లోకి అడుగుపెట్టింది. పెళ్లి కూతురు అలా నడుస్తూ వస్తుంటే సడన్ గా తన గౌన్ లో నుండి ఒక వ్యక్తి బయటికి వచ్చాడు. అందరూ షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే, రోయల్ లునేసా అనే ఒక వ్యక్తి బ్రోస్ బ్రైడల్ గౌన్స్ అండ్ ఈవెంట్స్ లో పని చేస్తున్నాడు. ఇటీవల ఒక పెళ్లిలో ఆ సంస్థ పెళ్లి కూతురు కోసం ఒక గౌన్ తయారు చేసింది.
Video Advertisement
ఆ రోజు గాలి ఎక్కువగా ఉండడంతో ఆ పెళ్ళి కూతురు గౌన్ లో నడుస్తూ ఉంటే గాలికి పైకి లేస్తోంది. అందుకే రోయల్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను పెళ్లి కూతురి గౌన్ లోకి దూరతాను అని చెప్పాడు. అందరితో పాటు పెళ్లి కూతురు కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా కానీ, అతిథులు అందరిముందు గౌన్ అలా ఎగురుతూ ఉండడం బాగుండదు అని చెప్పి ఆమె కుటుంబ సభ్యులు, పెళ్ళి కూతురు కలిసి దీనికి అంగీకరించారు.
పెళ్లి కూతురు తన తల్లిదండ్రులతో కలిసి పెళ్లి వేడుక వద్దకి చేరేంతవరకు రోయల్ గౌన్ లో ఉండి ఎగరకుండా, పెళ్లి కూతురు కాళ్ళకి అడ్డం పడకుండా జాగ్రత్త పడ్డాడు. పెళ్లి కొడుకు ముందుకు వచ్చి పెళ్లి కూతురు చెయ్యి అందుకోగానే రోయల్ పెళ్లి కూతురి గౌన్ లో నుండి బయటికి వచ్చేశాడు.
ఎవరూ చూడలేదు కదా అనుకున్నాడు. కానీ అప్పటికే అందరూ చూసేశారు. ఇదంతా కెమెరాలో కూడా రికార్డయింది అయితే ఒక వార్తా సంస్థతో రోయల్ మాట్లాడుతూ ఆ రోజు గాలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి అలా చేయాల్సి వచ్చింది అని, కానీ పెళ్లి కూతురు ఆ గౌన్ లోపల మరొక డ్రెస్ వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదు అని చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
watch video :
End of Article