Home News ఛీ!ఛీ! ఇలాంటి భర్త కూడా ఉంటాడా? మరదలిని పెళ్లి చేసుకోవాలని భార్యను, ఏడాది పాపను ఏం చేసాడంటే.?

ఛీ!ఛీ! ఇలాంటి భర్త కూడా ఉంటాడా? మరదలిని పెళ్లి చేసుకోవాలని భార్యను, ఏడాది పాపను ఏం చేసాడంటే.?

by Mohana Priya

ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ లో జరిగిన ఒక సంఘటన చర్చలకి దారితీసింది. ఒక వ్యక్తి తప్పుడు ఆలోచన రెండు నిండు ప్రాణాలని బలికొంది. వివరాల్లోకి వెళితే నీరజ్ కుష్వాహా అనే ఒక వ్యక్తి లలిత్ పూర్ లోని సదర్ కొత్వాలీ ప్రాంతంలోని చంద్ మారి గ్రామంలో నివసిస్తాడు.

అక్కడ ముసుగు ధరించిన కొంత మంది వ్యక్తులు తమ ఇంట్లోకి వచ్చి తన భార్య, కూతురు మీద దాడి చేశారు అని నీరజ్ చెప్పాడు. రాత్రి 1:30 ఆరుగురు దొంగలు వాళ్ళ ఇంట్లోకి వచ్చి తన కూతురిని, భార్యని చంపేశారు అని చెప్పాడు. తన నోట్లో సాక్స్ కుక్కి, నగదు, నగలు దోచుకుని పారిపోయారు అని అన్నాడు. అంతే కాకుండా నకిలీ గాయాలతో ఆసుపత్రిలో కూడా చేరాడు.

man in lalitpur incident

ఇదే విషయాన్ని ఆసుపత్రిలో స్టేట్మెంట్ గా ఇచ్చాడు. కానీ పోలీసులు మాత్రం నీరజ్ చెప్పిన దాన్ని నమ్మలేదు. దాంతో మరింత విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. 22 ఏళ్ల తన భార్య అందంగా ఉండేదని, రోజంతా రిలీజ్ చేస్తూ ఉండేది అని, సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో మాట్లాడేది అని చెప్పాడు. వారిద్దరికీ ఒక కూతురు కూడా ఉంది.

man in lalitpur incident

అయితే నీరజ్ తన మరదలిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఈ విషయాన్ని తన భార్యతో చెప్తే ఒప్పుకోలేదు. దాంతో క్రికెట్ బ్యాట్ తో ఆమెను కొట్టి చంపాడు. ఏడాది వయసున్న తన కూతురిని కూడా క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపేశాడు. ఇంట్లో ఆభరణాలు అన్నీ కూడా టీవీ వెనకాల దాచి పెట్టేసి, ఇంట్లో వస్తువులు చిందరవందరగా చేసి. ఇంట్లో దొంగతనం జరిగినట్టు క్రియేట్ చేసి. తనకి కూడా దెబ్బలు తగిలినట్టు అందరిని నమ్మించాడు. ఈ విషయాన్ని పోలీసులు విచారణలో తెలుసుకొని అరెస్ట్ చేశారు.

You may also like