ఈ వీడియోలో ఆ వ్యక్తి చేసిన పని రైటా? రాంగా? మీరు ఏం అనుకుంటున్నారు?

ఈ వీడియోలో ఆ వ్యక్తి చేసిన పని రైటా? రాంగా? మీరు ఏం అనుకుంటున్నారు?

by Megha Varna

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావడం అటు ఉంచితే ఏ వాహనాలు తిరగకపోవడం ప్రజలు బయటకు రాకపోవడం వలన కాలుష్యం తగ్గి ఎర్త్ హీల్ అవుతుంది అని కొన్ని కధనాలు వినపడ్డాయి.కాగా కాలుష్యం తగ్గడం వలన అంతరించిపోతున్న వన్యప్రాణుల ప్రాణాలకు రక్షణ లభించింది.అయితే వినీత్ వశిష్ట్ అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఓ వైల్డ్ లైఫ్ వీడియో ఇప్పుడు అంతటా వైరల్ గా మారింది.అయితే వినీత్ ఆ వీడియోను పోస్ట్ చేసిన ప్రశ్న ఇప్పుడు ఆసక్తిగా మారింది..వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

ఆ వీడియో లో ఓ కొండచిలువ జింక ను మింగేయడానికి ప్రయత్నించగా అటు వైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి కర్రతో బెదిరించడం వలన కొండచిలువ జింక ను వదిలివెళ్లిపోతుంది.అయితే ఆ వ్యక్తి ఆలా జింక ను కాపాడడం సరైనదా అని ప్రశ్న ను సంధించారు వినీత్.అయితే కొంతమంది నెటిజన్లు జింకను కాపాడి మంచి పని చేసాడు ఆ వ్యక్తి అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యగా కొంతమంది మాత్రం ఈ సృష్టిలో ప్రతీ జంతువూ ఇంకో జంతువును చంపే జీవిస్తుంది కాబట్టి ఆ కొండచిలువకు ఆహారం లేకుండా చేసిన వ్యక్తిదే చాలా తప్పు అని స్పందిస్తున్నారు.


You may also like