సాధారణంగా బైక్ మీద ఇద్దరు వ్యక్తులకంటే ఎక్కువ మంది ప్రయాణం చేయడం మనం చూస్తూనే ఉంటాం. బాగా అడ్జస్ట్ అయిన తర్వాత మహా అయితే బైక్ మీద ఐదుగురు ప్రయాణించగలుగుతారు. కానీ అంతకంటే ఎక్కువ మంది ప్రయాణించడం కష్టం మాత్రమే కాదు అసాధ్యం కూడా. ఈ విషయాన్ని తప్పు అని ఇటీవల ఒక వ్యక్తి నిరూపించాడు. తన బైక్ మీద ఆరుగురు కాదు ఏడుగురు కాదు ఏకంగా 12 మంది పిల్లల్ని కూర్చోపెట్టుకుని ప్రయాణించాడు.man driving bike with 12 children

వారందరూ కూడా 10 సంవత్సరాలలోపే ఉంటారు. అసలు ఆ పిల్లలందరినీ బైక్ మీద ఎలా ఎక్కించాడో, అసలు ఎలా బ్యాలెన్స్ చేయగలిగాడో ఆ వ్యక్తికే తెలియాలి. వీరిలో కొంత మంది పిల్లలు వేలాడుతున్నట్లుగా ఉన్నారు. ఈ వీడియోని ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో చాలా మంది ఇలాంటి స్టంట్స్ చేయకండి అంటూ హెచ్చరిస్తున్నారు. కానీ నిజంగా ఇలాంటి ప్రయాణాలు ప్రమాదకరమే. ప్రస్తుతం అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :