Ads
ఒక మనిషి అవతల మనిషికి సహాయం చేయడం అంటే డబ్బు ఇవ్వడం ఒక్కటే కాదు. ఇంకా చాలా ఉంటాయి. మనకు ఏదైనా అవసరం అయినప్పుడు ఆ అవసరమైన దాన్ని ఇవ్వడం లేదా మనకు తెలియకుండా ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు వచ్చి ఆపడం, మనం చేస్తున్నది తప్పు అని చెప్పడం, ఇతరులను ప్రమాదాల నుండి కాపాడటం ఇవన్నీ కూడా సహాయాల కిందికే వస్తాయి.
Video Advertisement
అలా మనకు సహాయం చేసిన వ్యక్తి మన నుండి ఆశించేది కృతజ్ఞత ఒకటే. ఆ కృతజ్ఞత ఏ రూపంలో వ్యక్తపరుస్తాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనకు సహాయం చేసిన వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వచ్చు, భోజనం పెట్టొచ్చు లేకపోతే థాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవచ్చు.
కొంతకాలం క్రితం కోరా లో “మీరు ఇవాళ ఇంటర్నెట్ లో చూసిన బెస్ట్ థింగ్ (మంచి విషయం) ఏంటి?” అని ప్రశ్న అడిగారు. దానికి సేతు కుమార్ అనే వ్యక్తి ఈ విధంగా జవాబిచ్చారు.
ఇవాళ నేను ఇంటర్నెట్ లో ఫీడ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన నాకు కనిపించింది. ఇది అందరికీ తెలియడం ముఖ్యం అని అనిపించింది. ఈ ఫోటోలో గ్రీన్ సర్కిల్ లో ఉన్న వ్యక్తిని చూడండి. అతను ఒక ట్రైన్ ఆక్సిడెంట్ జరగకుండా ఆపి కొన్ని వందల ప్రాణాలను కాపాడాడు.
ఈ సంఘటన జూన్ 15వ తేదీ 2018 లో జరిగింది. అప్పుడు సమయం దాదాపు ఐదున్నర అవుతోంది. అంబాసా నుండి అగర్తల కి వెళ్లే ట్రైన్ పట్టాలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పాడయ్యాయి. ఆ విషయం ఇతనికి తప్ప ఎవరికీ తెలియదు.
దాదాపు రెండు గంటల పాటు అక్కడే అలాగే ట్రైన్ వస్తున్నప్పుడు చూసి వెళ్లి తన గురించి, తన కూతురు గురించి ఆలోచించకుండా ట్రైన్ కి అడ్డంగా నిలబడి టవల్ చేతిలో పట్టుకొని ఊపాడు. ట్రైన్ నడిపే వ్యక్తి ఇతనిని చూసి ఏదో ప్రమాదం ఉంది అని గ్రహించి ట్రైన్ ఆపాడు. దాంతో ప్రమాదం తప్పింది.
ఈ వ్యక్తి పేరు స్వపన్ దెబ్బర్మ. ఇతను ముంగియాకామి ప్రాంతం యొక్క నివాసి. స్వపన్ పక్కన ఉన్నవాళ్లు అతని కూతురు, ఇంకా లోకో పైలట్” అని పేర్కొన్నారు. అంతసేపు ట్రైన్ వచ్చేంత వరకు ఓర్పుగా అక్కడే ఎదురు చూసి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన స్వపన్ దెబ్బర్మ చేసిన పని నిజంగానే ఎంతో అభినందించాల్సిన విషయం. అలా తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇతరుల కోసం ఆలోచించే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. వాళ్లలో స్వపన్ దెబ్బర్మ కూడా ఒకరు.
End of Article