ఐఫోన్ మీద ప్రేమతో ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా..? డైరెక్ట్ షాప్ కి వెళ్లి..?

ఐఫోన్ మీద ప్రేమతో ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా..? డైరెక్ట్ షాప్ కి వెళ్లి..?

by kavitha

Ads

ఐ ఫోన్ల పై యూత్ కు ఉండే క్రేజ్ వేరు. చాలామందికి ఐ ఫోన్ ను కొనుక్కోవాలని భావిస్తుంటారు. దానికి కారణం అందులో ఉండే అద్భుతమైన ఫీచర్లు అని చెప్పవచ్చు. అయితే సామాన్యులు ఐ ఫోన్ కొనాలంటే ఆలోచిస్తారు. ఆకర్షణ, ఫీచర్లతో పాటు దాని రేటు కూడా ఎక్కువే.

Video Advertisement

ఖరీదైన ఫోన్ కావడంతో సామాన్యులు, మధ్యతరగతి వారు కొనడం చాలా కష్టం. అందువల్ల ఐ ఫోన్ వంక కూడా చూడలేరు. అయితే ఇక్కడ ఒక బిచ్చగాడు ఐ ఫోన్ కొనుగోలు చేసి, అందరు ఆశ్చర్యపోయేలా చేశాడు. అతను ఐ ఫోన్ కొనుగోలు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఐ ఫోన్ సిరీస్ లు వచ్చిన వెంటనే అమ్ముడవుతాయి. రీసెంట్ గా కొత్తగా ఐఫోన్ 15, ప్రో మాక్స్ రిలీజ్ అయ్యాయి. అలా రాగానే ఐ ఫోన్ లవర్స్ ఎగబడి మరి వాటిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఐఫోన్ అంటే ఇష్టం ఉన్న ఒక బిచ్చగాడు చిల్లర నాణేలను యాపిల్ స్టోర్‌కు తీసుకువచ్చి, ఆ నాణేలతో యాపిల్ ఫోన్ ను కొనుగోలు చేశాడు. దీనికి  సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.
ఇక ఆ వీడియోలో మాసిపోయిన బనియన్, లుంగీతో శరీరం అంతా మురికితో ఒక బిచ్చగాడు, జనాలతో రద్దీగా ఉన్న యాపిల్ స్టోర్‌కు వెళ్ళాడు. ఒక సంచీని భుజానికి వేసుకుని ఉన్నాడు. అయితే స్టోర్ లో ఉన్నవారు ఏం జరుగుతుందో అర్థం కాక అతన్ని చూడడం మొదలుపెట్టారు. ఆ బిచ్చగాడు కొత్తగా రిలీజ్ అయిన ఐఫోన్ 15 ప్రో మాక్స్ యాపిల్ ఫోన్ కొనడం కోసం స్టోర్‌కు వచ్చినట్లు చెప్పాడు. అది విన్నవారు అతను జోక్ చేస్తున్నాడని భావించారు. అయితే అతను తాను తీసుకువచ్చిన సంచీలో ఉన్న డబ్బును చూపించడంతో అందరూ షాక్ అయ్యారు.
సంచిలో తీసుకువచ్చిన చిల్లర అంతా స్టోర్‌లోని ఫ్లోర్‌ పై పోసి, వాటిని తీసుకుని యాపిల్ ఫోన్ 15 ప్రో మాక్స్ ఇవ్వామని అడిగాడు. ఇక ఆ స్టోర్‌ సిబ్బంది అందరూ ఆ నాణేలను లెక్కించగా, రూ.1.59 లక్షల ఉంది. అవి తీసుకుని అతనికి ఐఫోన్ ను ఇచ్చారు.దీనికి సంబంధించిన వీడియోను తీసి, సామాజిక మధ్యమంలో షేర్ చేయగా, ప్రస్తుతం వైరల్ గా మారింది. కానీ కొంత మంది మాత్రం ఇది ప్రాంక్ వీడియో అని అంటున్నారు. మరి కొంత మంది అయితే నిజంగానే ఇలా జరిగింది అంటున్నారు. నెటిజెన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Also Read: తండ్రినే అమ్మకానికి పెట్టిన కూతురు..! కారణం చూస్తే షాక్ అవ్వాల్సిందే..?


End of Article

You may also like