Ads
వేల కోట్ల భారతీయుల చిరకాల ఆకాంక్ష అయోధ్యలో శ్రీరాముని మందిర నిర్మాణం త్వరలో నెరవేరనుంది. జనవరి 22వ తారీఖున అత్యంత వైభవంగా శ్రీరామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం, శ్రీ రామ పట్టాభిషేకం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.
Video Advertisement
అలాగే దేశంలో ఉన్న ఎంతోమంది ప్రముఖులకు మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు కూడా అందాయి. మనకు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అయితే ఇప్పుడు ఈ మందిర ప్రారంభోత్సవానికి ఒక ముస్లిం కరసేవకుడికి ఆహ్వానం అందడం వైరల్ గా మారింది.
తనని రామచంద్ర ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. అయితే తాను జనవరి 22 తారీఖున ఈ కార్యక్రమానికి హాజరు కాలేనని చెప్పాడు.ఇంతకీ ఎవరు ఈ వ్యక్తి…ఇతనికి ఎందుకు ఇంత స్పెషల్ గా ఆహ్వానం అందించారు…ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందిన 70 ఏళ్ల మహ్మద్ హబీబ్‌కు అయోధ్య రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ శ్రీరాముడి అక్షింతలు, ఆహ్వానం పంపించింది. అయితే ఆ ఆహ్వాన పత్రిక అందుకున్న మహ్మద్ హబీబ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఒక రైతుగా సాధారణ జీవితం గడుపుతున్న తనకు అయోధ్య నుంచి ఆహ్వానం అందడంతో భావోద్వేగానికి లోనయ్యాడు అతడు. బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో 1992 డిసెంబర్ 2 వ తేదీ నుంచి 4, 5 రోజుల పాటు అయోధ్యలో ఉన్న మహ్మద్ హబీబ్ తనతో ఉన్న వారితో కలిసి కరసేవకుడిగా కొట్లాడాడు. ఆ సమయంలో మహ్మద్ హబీబ్ చేసిన పోరాటాన్ని గుర్తించిన అయోధ్య రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్, శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని అతనికి ఆహ్వానం పంపించింది. హిందువుల ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి ఒక ముస్లిం కి ఆహ్వానం పంపడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. భారతదేశం ఎందుకు మత సామ్రాస్య దేశమో అర్థం అవుతుందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు
End of Article