ఉత్తరాఖండ్లో ఇటీవల చోటు చేసుకున్న ఒక సంఘటన ప్రస్తుతం చర్చల్లో ఉంది. వివరాల్లోకి వెళితే అల్మోర జిల్లాలోని రాణిఖేత్ ప్రాంతానికి చెందిన 72 సంవత్సరాల మాదో సింగ్ మెహ్రా అనే వ్యక్తి చాలా సంవత్సరాల నుండి కనిపించడం లేదు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయన చనిపోయారు అనుకొని అంత్యక్రియలు జరిపారు. మిస్ అయిన 24 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇంటికి తిరిగి వచ్చారు.

Man who was missing for 24 years suddenly returned home

దాంతో కుటుంబ సభ్యులు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆయనని ఇంట్లోకి అడుగు పెట్టని ఇవ్వలేదు. చివరికి ఆయన భార్యని కూడా కలవలేదు. దీని వెనక ఒక కారణం ఉంది. అదేంటంటే ఇప్పుడు మాదో సింగ్ మెహ్రాకి అంత్యక్రియలు జరిపారు. అంటే ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

Man who was missing for 24 years suddenly returned home

అయితే ఆయనని మళ్లీ పుట్టిన వాడు గావిస్తూ కొత్తగా నామకరణం చేయాలి అని, అలా నామకరణం చేసిన తర్వాత మాత్రమే ఇంట్లోకి రానివ్వాలి అని పండితులు చెప్పారట. దాంతో ఆయన నక్షత్రం, రాశి ఆధారంగా మళ్లీ పేరు పెట్టాలి అని పేర్కొన్నారు. దీంతో మాదో సింగ్ మెహ్రా కి ఊరి వాళ్ళు ప్రత్యేకంగా టెంట్లు వేసి వసతి కల్పించారు.

Man who was missing for 24 years suddenly returned home

representative image

ఈ విషయంపై మాదో సింగ్ మెహ్రా మేనల్లుడు మాట్లాడుతూ “మా మామయ్య మిస్ అయినప్పుడు నేను చాలా చిన్న పిల్లవాడిని. ఆయన గురించి మా కుటుంబ సభ్యులు అందరూ చాలా చోట్ల వెతికారు. దాదాపు పదేళ్లు ఎదురు చూసాం. కానీ తిరిగి రాలేదు. దాంతో పండితుడిని కలిసాం. ఆయన అప్పుడు మామయ్య జాతకాన్ని చూసి ఆయన బతికి ఉండే అవకాశాలు లేవు అని చెప్పారు దాంతో అంత్యక్రియలు జరిపించాం” అని అన్నారు.