అయితే ఆమె పవన్ సరసన నటించట్లేదా? అసలు ఆ ఫేక్ న్యూస్ ఎందుకు వచ్చింది?

అయితే ఆమె పవన్ సరసన నటించట్లేదా? అసలు ఆ ఫేక్ న్యూస్ ఎందుకు వచ్చింది?

by Megha Varna

Ads

సామాన్య ప్రేక్షుకుల నుండి ఒక వర్గం అభిమానుల వరకు మా హీరో ఏంచేస్తున్నాడు ,తర్వాత ఏమి చెయ్యబోతున్నాడు ,ఎలాంటి చిత్రంలో నటించబోతున్నాడు , పర్సనల్ లైఫ్ ఏంటి , ఎవరితో ప్రేమలో ఉన్నాడు అనే తదితర విషయాలపై ఆసక్తి ఉండడం సహజం.దానిని కొన్ని మీడియా చానెల్స్ ,వెబ్ సైట్స్ బాగా ఉపయోగించుకుంటున్నాయి. అధికార ప్రకటన రాకముందే ఈ చిత్రం కథ ఎలా ఉండబోతుంది ,హీరోయిన్ గా పలానా హీరోయిన్ నటిస్తుంది అంటూ గాసిప్స్  రాస్తూ ఉంటారు.వీటి మీద తరువాత పెద్ద చర్చలే జరుగుతాయి.

Video Advertisement

అసలు ఎప్పటినుండో ఇటువంటి ఫేక్ న్యూస్ ,గాసిప్స్ మీద సినిమా హీరోలు ,హీరోయిన్ లు పెద్ద రేంజ్లో మండిపడుతూనే ఉన్నారు.కాగా తాజాగా విజయ దేవరకొండ మీద ఓ వెబ్ సైట్  తప్పుగా ప్రచారం చెయ్యడంతో ఈ వివాదం మరింత ముదిరింది.దీంతో విజయ్ దేవరకొండ ఆ వెబ్ సైట్ మీద విపరీతంగా ఫైర్ అయ్యారు.ఈ సంఘటనపై సినిమా పెద్దలందరూ కూడా మండిపడ్డారు.ఈ ఫేక్ న్యూస్లు , గాసిప్స్  రాసె వెబ్ సైట్  మీద పక్కా యాక్షన్ తీసుకోవాలని దానికి సంబందించిన ప్రణాలికను సిద్ధం చెయ్యడంలో బిజీగా ఉన్నారు సినీ పెద్దలు.కాగా లాక్ డౌన్ ముగియగానే ఇలాంటి వెబ్ సైట్స్  మీద చర్య తీసుకుంటారని తెలుస్తుంది.ఈ నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్ చిత్రం గురించి వచ్చిన ఒక గాసిప్ వలన హరీష్ శంకర్ తెగ ఫీలైపోతున్నాడు..వివరాల్లోకి వెళ్తే ..

పవన్ కళ్యాణ్ వీరాభిమాని హరీష్ శంకర్.కాగా ఎప్పటి నుండో ఒక్క హిట్ కూడా రాకుండా వరుస ప్లాప్ సినిమాలతో రన్ అవుతున్న పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ అనే భారీ బ్లాక్బస్టర్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్.ఈ చిత్రంతో హరీష్ శంకర్ ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారిపోయారు.ఈ చిత్రం లో దేవి శ్రీ ప్రసాద్ అందించిన బాణీలు ,బాక్రౌండ్ మ్యూజిక్ ,హరీష్ పంచ్ డైలాగ్స్ వలన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకొంది.అయితే మళ్ళీ పవన్ ,హరీష్ కాంబినేషన్ లో ఇంకో చిత్రం రానుంది.దీనికై ఇప్పటికే పక్కా స్క్రిప్ట్ రెడీ చేసారు హరీష్ శంకర్.

అయితే పవన్ ,హరీష్ చిత్రంలో మలయాళీ హీరోయిన్ ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి.అయితే అది నిజం కాదు.దానికి సంబందించిన అధికార ప్రకటన వెలువడలేదు.హరీష్ దీనిపై స్పందిస్తూ…నేను ఎప్పుడూ ట్విట్టర్ లో అందుబాటులో ఉంటాను అలాంటిది ఏమైనా ఉంటె నేను చెప్తాను కదా అయినా ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చెయ్యడం సరి కాదని హరీష్ అభిప్రాయపడ్డారు. ఓ పెద్ద మీడియా సంస్థ కూడా ఇలా రాయడం ఏంటి అంటూ ట్వీట్ చేసారు.సోషల్ మీడియాలో కూడా ఆమె ఫోటో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆమె గురించి అందరు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఈ విషయం తెలిసి నిరాశపడతారు అనుకుంటా అభిమానులు.అసలు ఆ పుకారు ఎలా స్టార్ట్ అయ్యిందో? బహుశా ఆ సినిమా టీం కి సంబందించిన వాళ్ళు ఎవరో ఆ హీరోయిన్ ని కాలిస్తున్నారా? లేక ఎప్పటిలాగే ఏం వార్తలు లేక పుకార్లు సృష్టించారా?


End of Article

You may also like