Home News కేరళలో దారుణం… ఏడాది పాటు కొనసాగిన ప్రేమ బ్రేకప్ అవ్వడంతో..?

కేరళలో దారుణం… ఏడాది పాటు కొనసాగిన ప్రేమ బ్రేకప్ అవ్వడంతో..?

by Mohana Priya

కేరళలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే, సాక్షి కథనం ప్రకారం మానస కన్నూర్ కి చెందినవారు. ఇందిరా గాంధీ కాలేజ్ లో డెంటల్ కోర్స్ ఫైనలియర్ చదువుతున్నారు. స్నేహితులతో కలిసి రూమ్ లో ఉంటున్నారు. అదే జిల్లాకు చెందిన రాఖిల్ తో మానసకి సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన తర్వాత మళ్లీ ఇద్దరూ ప్రేమలో పడ్డారు.manasa rakhil

అయితే నెల రోజుల క్రితం మానస రాఖిల్ కి బ్రేక్ అప్ చెప్పారు. దాంతో రాఖిల్ ను బతిమాలడం మొదలు పెట్టారు. ఈ విషయంపై మానస కన్నూర్ పోలీస్ స్టేషన్లో వేధింపులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీస్ పంచాయతీ జరిగిన తర్వాత రాఖిల్ తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేయడంతో బెదిరించి వదిలేసారు పోలీసులు.manasa rakhil

దాంతో రాఖిల్ మానస మీద కోపం పెంచుకున్నారు. తన బ్రేక్ అప్ కి ముగింపు పలకాలి అని అనుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కొత్త మంగళంలో మానస ఉంటున్న రూమ్ లోకి వెళ్లి, ఆమెతో గొడవకి దిగి మానసని మరో రూమ్ లోకి తీసుకువెళ్ళారు. ఆమె రూమ్మేట్స్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళని తుపాకీతో బెదిరించి మానసపై కాల్పులు జరిపారు. అయితే, రాఖిల్ దగ్గరికి తుపాకీ ఎలా వచ్చింది అనేది ఇంకా ప్రశ్నగానే ఉంది. ప్రస్తుతం ఈ ఘటన కేరళలో చర్చనీయాంశంగా మారింది.

You may also like