Home Filmy Adda తూనీగా తూనీగా… పాటలోని పాప ఇప్పుడెలా ఉందో తెలుసా?

తూనీగా తూనీగా… పాటలోని పాప ఇప్పుడెలా ఉందో తెలుసా?

by Sunku Sravan

ఉదయ్ కిరణ్, రీమాసేన్ నటించిన మనసంతా నువ్వే సినిమా లో తూనీగా తూనీగా అనే పాట అప్పట్లో పెద్ద సంచలనం. ఆ పాటలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ తన చక్కని రూపం మరియు అభినయం తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

ఆ పాటలోని పాప ఇప్పుడు ఏం చేస్తుందో ఎలా ఉందో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు సుహాని. త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె ప్రకటించారు. ఆనాటి ఆ ముద్దుల పాప నేడు పెళ్లి పీఠలు ఎక్కబోతుందన్నమాట. ఇప్పుడు ఆమె వయసు 31.

Suhani

Suhani

బాల రామాయణం చిత్రం తో తెలుగు తెరకు పరిచయమైనా సుహాని చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించింది. తన నటనకు గాను నంది అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఆ తరువాత మోడలింగ్ రంగం లో రాణించింది. చివరగా 2010 లో వచ్చిన స్నేహగీతం అనే సినిమాలో కూడా నటించింది. మ్యుజీషియన్, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజా ను పెళ్ళాడుతున్నట్లు ఆమె ప్రకటించింది. ఈ మధ్యే ఆయనతో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

You may also like