Home Filmy Adda “మనసంతా నువ్వే”లో ఉదయ్ కిరణ్ చెల్లిగా నటించిన ఈ ఆర్టిస్ట్ గుర్తున్నారా? ఆమె ఎవరో.? ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.?

“మనసంతా నువ్వే”లో ఉదయ్ కిరణ్ చెల్లిగా నటించిన ఈ ఆర్టిస్ట్ గుర్తున్నారా? ఆమె ఎవరో.? ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.?

by Mohana Priya

Ads

కొన్ని సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించే నటులు హీరో హీరోయిన్ల కంటే లేదా హీరో హీరోయిన్ల తో పాటు సమానంగా రిజిస్టర్ అవుతారు. అలా తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించిన నటి శిరీష. 2000 సమయంలో దాదాపు వచ్చిన ప్రతి సినిమాలో శిరీష కచ్చితంగా ఉండేవారు.

Video Advertisement

ఒక్కడు సినిమాలో మహేష్ బాబు వాళ్ళ ఇంటి ఎదురుకుండా ఉండే అమ్మాయి పాత్రలో నటించారు శిరీష. మనసంతా నువ్వే సినిమాలో ఉదయ్ కిరణ్ చెల్లెలిగా నటించారు. ఆ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లో పాపులర్ అయ్యారు.

తర్వాత అతడే ఒక సైన్యం సినిమా లో జగపతి బాబు చెల్లెలి పాత్రలో, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో ఒక ముఖ్య పాత్రలో, పల్లకిలో పెళ్లికూతురు సినిమా లో హీరో చెల్లెలు గా, ఇంకా ఎన్నో సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించారు శిరీష.

తర్వాత సుందరకాండ సీరియల్ ద్వారా సీరియల్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల వరకు విరామం తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ స్టార్ మా లో ప్రసారమయ్యే మౌనరాగం సీరియల్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సీరియల్ లో హీరోయిన్ తల్లి పాత్రలో నటిస్తున్నారు శిరీష.

మౌనరాగం సీరియల్ ఎంతో ప్రజాదరణ పొందుతోంది. దాంతో శిరీష కూడా తెలుగు ప్రజలకి ఇంకా చేరువయ్యారు. కొంతకాలం విరామం తర్వాత సీరియల్స్ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శిరీష మళ్లీ సినిమాల్లో కూడా అడుగు పెడతారేమో వేచి చూద్దాం.


End of Article

You may also like