Ads
మనిషిగా పుట్టిన ప్రతీవారికి ఎమోషన్ ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.కొంతమంది నేరస్తులు కూడా స్వచంగా స్నేహం చెయ్యడం,ప్రేమించడం లాంటి ఘటనలను ఇప్పటిదాకా సినిమాలలో మనం చాలానే చూసాం.అయితే ఒక వ్యక్తి దగ్గర ఉన్న వస్తువులను ఇద్దరు దొంగలు దోచుకున్నారు.అయితే ఆ సదరు వ్యక్తి కన్నీరు పెట్టుకోవడంతో అతని వస్తువులు అతనికి తిరిగి ఇచ్చేసారు ఆ దొంగలు.కాగా ఈ ఘటన కరాచీలో చోటు చేసుకుంది..వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
ఇటవల సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల అయ్యి అంతటా వైరల్ గా మారింది.ఆ వీడియో లో ఏముంది అంటే ..కరాచీ లో ఓ డెలివరీ బాయ్ ఒకచోట డెలివరీ ఇచ్చేసి రోడ్ పై బైక్ మీద వెళ్తూ ఉంటాడు.అయితే ఆ డెలివరీ బాయ్ ని ఇద్దరు దొంగలు వెంబడిస్తారు.కాగా ఎవరూ లేని ప్రదేశం దగ్గరకి వచ్చేటప్పటికి ఆ డెలివరీ బాయ్ ని ఆ దొంగలు ఆపి ఆ డెలివరీ బాయ్ దగ్గర ఉన్న విలువైన వస్తువులను తీసుకుంటారు.అయితే అంతలో ఆ డెలివరీ బాయ్ కంటతడి పెట్టుకుంటాడు.
దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనయిన ఆ దొంగలు ఆ డెలివరీ బాయ్ వస్తువులు తిరిగి ఇచ్చేసి కౌగిలించుకుంటారు.అంతే కాకుండా ఆ డెలివరీ బాయ్ బండి మీద వెళ్తుండగా ఆ దొంగలు అతనితో నవ్వుతు మాట్లాడుతూ ఉంటారు.కాగా ఈ వీడియో చుసిన నెటిజన్లు ఎంత దొంగలైనా గాని వాళ్ళు కూడా మనుషులే అని నిరూపించుకున్నారు,మానవత్వం ఇంకా బతికే ఉంది అనడానికి ఇదే నిదర్శనం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
End of Article