“మంచు విష్ణు” చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన… సినిమా ఏదో తెలుసా..?

“మంచు విష్ణు” చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన… సినిమా ఏదో తెలుసా..?

by Megha Varna

Ads

మంచు విష్ణు అందరికీ సుపరిచితమే. టాలీవుడ్ లో పలు సినిమాలు చేసాడు. కానీ అంత సక్సెస్ అవ్వలేకపోయాడు. అయితే చాలా మంది మంచు విష్ణు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విషయం తెలియదు. హీరోగానే కాదు ఓ సినిమా లో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు చైల్డ్ ఆర్టిస్ట్ కింద నటించాడు.

Video Advertisement

మంచు విష్ణు చైల్డ్ ఆర్టిస్ట్ కింద నటించిన సినిమా రగిలే గుండెలు. ఈ సినిమాలో విష్ణు చిన్న రోల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసాడు. ఇదిలా ఉంటే తాజాగా మంచు విష్ణు హీరోగా వచ్చిన సినిమా జిన్నా.

ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. వీరు మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహించారు. మంచు విష్ణు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం ఇచ్చారు. ఈ సినిమా విడుదల అయ్యింది. మంచి టాక్ ఈ సినిమాకు వచ్చింది.

ఈ సినిమాలో ఒక పాటని మంచు విష్ణు కూతుర్లు అరియానా-వివియానా పాడారు అన్న విషయం తెలిసిందే. ఆ పాటలో వారు కనిపిస్తారు కూడా. ఈ సినిమాలో మంచు విష్ణు గెటప్ చాలా డిఫరెంట్ గా ఉంది. సన్నీ లియోన్ అంతకు ముందు మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంట్ తీగ సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో ఇప్పుడు నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల అయ్యింది.

 


End of Article

You may also like