“నొప్పులు రాకుండా నేర్పే ఆచార్యని పెట్టుకో..!” అంటూ… “మంచు విష్ణు” ట్వీట్‌కి నెటిజన్ రిప్లై..!

“నొప్పులు రాకుండా నేర్పే ఆచార్యని పెట్టుకో..!” అంటూ… “మంచు విష్ణు” ట్వీట్‌కి నెటిజన్ రిప్లై..!

by Mohana Priya

Ads

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తెరపై కనిపిస్తే చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూశారు. అంతకుముందు మగధీర సినిమాలో, ఆ తర్వాత బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి చిన్న పాత్రలో కనిపించారు. అలా కాకుండా వారిద్దరూ కలిసి ఒక ఫుల్ లెంత్ సినిమాలో నటించాలి అని అందరూ అనుకున్నారు.

Video Advertisement

ఆచార్య సినిమాతో అది జరుగుతుంది అని తెలిసాక అసలు సినిమా ఎలా ఉండబోతోంది? ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయా? అని అనుకున్నారు. కానీ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు అని చెప్పాలి.

acharya movie review

సినిమా కథ మనం చాలా సినిమాల్లో చూశాం. సినిమా నడుస్తున్న కొద్దీ ఏమవుతుంది అనే ఆసక్తి ఎవరిలో ఉండదు. ఎందుకంటే ఏమవుతుంది అనేది అందరికీ తెలిసిపోయి ఉంటుంది. చాలా చోట్ల సినిమా డల్ గా అనిపిస్తుంది. చిరంజీవి నటన బాగున్నా కూడా చాలా సీన్స్ లో చాలా డల్ గా ఎనర్జీ లేకుండా నటించారు అన్నట్టు అనిపిస్తుంది. రామ్ చరణ్ తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. సహాయ పాత్రల్లో చాలా మంది తెలిసిన నటులు ఉన్నాకూడా పెద్దగా హైలెట్ అయ్యే పాత్రలు ఎవరివి లేవు. అంతే కాకుండా కాజల్ పాత్ర కూడా సినిమా నుండి కట్ చేశారు. అసలు కాజల్ పాత్ర సినిమా నుండి తీసేయడానికి కారణం ఏంటి అనేది తెలియదు. ఇదిలా ఉండగా మంచు విష్ణు నిన్న చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

manchu vishnu tweet about dance rehearsals goes viral

మంచు విష్ణు తన రాబోయే సినిమాకి సంబంధించి ట్వీట్ చేశారు. అందులో మంచు విష్ణు, “డాన్స్ రిహార్సల్స్ స్టార్ట్ చేశాను. నా శరీరమంతా నొప్పి పెడుతోంది” అని రాశారు. ఈ ట్వీట్ కి చాలా మంది నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. అందులో ఒకరు, “ఒళ్ళు నొప్పులు రాకుండా నేర్పే ఆచార్య ని పెట్టుకో” అని రిప్లై ఇచ్చారు. మరొకరు కూడా ఇదే విధంగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం అయితే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


End of Article

You may also like