Home News కత్తి మహేష్ మృతిపై మందకృష్ణ మాదిగ సంచలన కామెంట్స్…యాక్సిడెంట్ పై పలు అనుమానాలు.!

కత్తి మహేష్ మృతిపై మందకృష్ణ మాదిగ సంచలన కామెంట్స్…యాక్సిడెంట్ పై పలు అనుమానాలు.!

by Mohana Priya

ప్రముఖ క్రిటిక్, నటులు కత్తి మహేష్ గత శనివారం తన ప్రాణాలను కోల్పోయారు. ఈ సంవత్సరం జూన్ లో యాక్సిడెంట్ కి గురైన కత్తి మహేష్ చెన్నైలో అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చివరి శ్వాస విడిచారు. కత్తి మహేష్ మృతిపై ఎంతో మంది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కత్తి మహేష్ అంత్యక్రియలు జులై 12వ తేదీన నిర్వహించారు. ఈ క్రమంలో ఎంతో మంది గ్రామస్తులు తరలివచ్చారు.

అంతిమయాత్రలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా పాల్గొన్నారు. కత్తి మహేష్ పాడె మోసి, ఆయన మృతదేహాన్ని ఖననం చేసే వరకు మందకృష్ణ అక్కడే ఉన్నారు. అయితే అంతకుముందు మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ కత్తి మహేష్ మృతిపై కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. కత్తి మహేష్ మరణంపై ఆయనకి అనేక అనుమానాలు ఉన్నట్టు వ్యక్తం చేశారు.

Manda Krishna madiga on Kathi Mahesh death

సమయం కథనం ప్రకారం మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, “కారులో కత్తి మహేష్ తో పాటు ప్రయాణించిన సురేష్ అనే వ్యక్తికి ఒక గాయం కూడా కాకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది అని అన్నారు. డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న సురేష్ వైపుగానే కారు నుజ్జు నుజ్జు అవ్వగా, అతనికి చిన్న గాయం కూడా కాకపోవడం, సురేష్ పక్కన కూర్చున్న కత్తి మహేష్ కి అంత తీవ్రంగా గాయాలు కావడం వంటి పరిణామాలు అనుమానాలకు దారి తీస్తున్నాయి అని పేర్కొన్నారు.

Manda Krishna madiga on Kathi Mahesh death

అలాగే చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్పించినప్పటి నుంచి అంతా బాగానే ఉంది అని, కత్తి మహేష్ కొద్ది రోజుల్లోనే కోలుకుని డిశ్చార్జి అవుతారని ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆయన మరణించారు అని చెప్పడం అనుమానంగా ఉంది అని అన్నారు. కత్తి మహేష్ కి ప్రమాదం జరిగినప్పటి నుంచి, ఆయన మరణం వరకు సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మందకృష్ణ కోరారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి ఎంతో మద్దతు తెలిపిన కత్తి మహేష్ అభివృద్ధిపై ఉన్న మిస్టరీని ఛేదించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిపై ఉంది అని పేర్కొన్నారు.

watch video :

https://www.facebook.com/100004480036228/videos/3044295945814746/

video sourced from : Samayam Telugu

You may also like