ఒకపక్క కరోనా … మరోపక్క మద్యం బాబులు…! ఫినైల్ తాగి ఒకరు…పిచ్చెక్కి ఒకరు..!

ఒకపక్క కరోనా … మరోపక్క మద్యం బాబులు…! ఫినైల్ తాగి ఒకరు…పిచ్చెక్కి ఒకరు..!

by Megha Varna

Ads

కరోనా వైరస్ ని అదుపు చెయ్యాలంటే వున్నా ఏకైక మార్గం సోషల్ డిస్టెన్స్ అని డాక్టర్స్ చెప్తున్నా కారణంగా వేరే ఏ విదంగాను ఈ మహంమారిని అదుపు చెయ్యలేమని దేశ ప్రభుత్త్వాలన్నీ కంప్లీట్ లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే .స్కూల్ లు ,కాలేజీలు ,ఆఫీసులు ,సినిమా హాల్ లు , బార్లు షాపింగ్ మాల్స్ అని తేడా లేకుండా అన్నిటికి సెలవు ప్రకటించారు ..రైల్వే బస్సు మార్గాలన్నిటిని పూర్తిగా ఆపేసారు దీనితో ప్రజలు నిత్యా అవసర వస్తువలకి కనీసం బయటకి వెళ్లి కూల్ డ్రింక్ త్రాగడానికి కూడా అవకాశం లేక చాలా బాధపడుతున్నారు..ఇదిలా ఉండగా వివరాల్లోకి వెళ్తే …

Video Advertisement

కరోనా కారణంగా మద్యం దుకాణాలు కూడా మూసి వెయ్యడంతో తీవ్ర మనోస్థాపానికి గురి అవుతున్నారు మందుబాబులు …మద్యం రేట్లు బారి స్థాయిలో పెంచక కూడా మందుబాబులని అదుపు చెయ్యడం ఎవరి వలన కాలేదు . తినడానికి లేకున్నా ఇంట్లో అవసరాలున్న మానుకొని మద్యం తాగేవారు కానీ ఇప్పుడు మద్యం దొరకకపోవడం తో మధ్యపాన ప్రియులందరికీ చెప్పుకోలేని కష్టం వచ్చిందని గతంలో ఎప్పుడు మేము మద్యం మొదలు పెట్టక ఇంత గ్యాప్ ఎప్పుడు రాలేదని వాపోతున్నారు .

లాక్ డౌన్ నేపథ్యంలో మందు దొరకక ఆల్కహాల్ ఎడిక్ట్స్ వింత వింతగా ప్రవర్తిస్తున్నారు ..వింత ప్రవర్తన చుసిన కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో చేరుస్తున్నారు ..కామారెడ్డి లో ఒకతను మందు లేక మత్తు కోసం ఏకంగా ఫినాయిల్ తాగాడు .కుటుంబ సభ్యులు చూసి సకాలంలో గుర్తించడంతో హాస్పిటాలిజ్డ్ చేయగా ప్రాణాపాయం తప్పింది ..ఇలా చాలామంది మందు దొరకక చుట్టూ వున్నావాలని తిట్టడం అనవసరం గ కోపపడడం , కొట్టడం లాంటివి చేస్తున్న సంగటనలు రాష్టంలో రోజురోజుకి నమోదు అవుతున్నాయి .

ఈ విషయంపై మానసిక వైద్య నిపుణులు ఏమంటున్నారంటే మత్తుకి బానిసైన ఆల్కహాల్ ఎడిక్ట్స్ అయినవారు ఇలా ప్రవర్తించడం సహజమేనని ..మొదటిగా విరిలో కాళ్ళు చేతులు వణకడం , దడదడగ అనిపించడం , కొంతమందిలో ఫీట్స్ రావడం జరుగుతాయని అన్నారు . మద్యానికి బానిస అయినవారి బ్రెయిన్ లో కెమికల్స్ న్యూరాన్స్ మద్యం తాగితే గాని నిద్రరాని స్థితికి మారిపోతాయని దానివలన మద్యానికి బానిసైనవారికి ఆల్కహాల్ లేకుండా నిద్ర రాదని అందువలన మానసిక సమస్యలు తలెత్తడం సహజమేనని అన్నారు .లాక్ డౌన్ కారణంగా మందు దొరకక రోజుకి పాదుల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదు అవుతున్నాయి అన్నారు.పాపం ఎవరి కష్టాలు వారివిలాగా మందుబాబులు కరోనా కారణంగా చాల కష్టాలు పడుతున్నారు.

watch video:


End of Article

You may also like