“ఆచార్య” సినిమా ఫ్లాప్ పై “మణి శర్మ” కామెంట్స్..!

“ఆచార్య” సినిమా ఫ్లాప్ పై “మణి శర్మ” కామెంట్స్..!

by kavitha

Ads

Tollywood: తెలుగు ప్రేక్షకులకు మెలోడి బ్రహ్మ మణిశర్మ ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.ఆయన టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితోను పని చేశారు. మెగాస్టార్  ‘చూడాలని వుంది’మూవీతో సంగీత దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టారు. మణిశర్మ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’కు సంగీతం అందించారు. కానీ ఈ మూవీ  బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది. దీంతో మణిశర్మ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సినిమాకి మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం బాలేదని విమర్శించారు.ఇక ఈ విషయం పై ఇప్పటి వరకు స్పందించని మణిశర్మ, వీటిపై తాజాగా ఓ షోలో మణిశర్మ స్పందించారు.

Video Advertisement

ప్రముఖ ఛానల్ లోని ఒక షోలో పాల్గొన్న మణిశర్మ ఆచార్య సినిమా గురించి, అలాగే  తన సినీకెరీర్ కు సంబంధించిన చాలా విషయాలను తెలియచేసారు. కోటి, కీరవాణి వంటి గొప్ప సంగీత దర్శకుల దగ్గర మెగాస్టార్  సినిమాలకి పనిచేస్తూ వచ్చానని, సినిమాలో రెండు పాటలు హిట్ అయ్యాయని, కానీ ఆ  సంగతి ఎవరు అనరని, అయినా కావాలని బ్యాడ్ అవుట్ పుట్ ఎలా ఇస్తానని అంటారు.
Acharya-telugu addaచిరంజీవికి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో నాకు తెలుసని మణిశర్మ చెప్పారు. ముందు ఇచ్చిన బీజీఎం వద్దని, దర్శకుడు కొరటాల శివ మీరు ఎలా అనుకుంటున్నారో అలా వద్దు. చాలా కొత్తగా ఉండాలని అన్నారని, దాంతో  బీజీఎం కొరటాల శివ కోరిక మేరకు మార్చాల్సి వచ్చిందని మణిశర్మ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం మణిశర్మ అన్న మాటలు నెట్టింట్లో  వైరల్ అవుతున్నాయి. దాంతో నెటిజన్లు ఆచార్య సినిమా పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై స్పందించారు. Mani-Sharma-telugu addaఏ చిత్ర బృందం అయినా తాము తీసిన సినిమా హిట్ అవ్వాలనే  తీస్తారని, అవికొన్నిసార్లు అవి హిట్  అవుతాయి. మరి కొన్నిసార్లు ప్లాప్ అవుతాయని,  దానికి  ఎవరిని విమర్శించడం కరెక్ట్  కాదని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇంతవరకు మణిశర్మ, చిరంజీవి కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి.  చూడాలని ఉంది, ఇంద్ర, బావగారు బాగున్నారా, ఠాగూర్ ఇలా చేసిన సినిమాలన్ని మ్యూజికల్ హిట్స్. మృగరాజు, జై చిరంజీవ సినిమాలకు కూడా మణిశర్మ మంచి సంగీతాన్ని ఇచ్చాడు.  అదేంటో ఒక్క ‘ఆచార్య’ సినిమాకి ఆ సెంటిమెంట్  పని చేయలేదు.


End of Article

You may also like