Ads
ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కొడుకు మహతి స్వర సాగర్ ఎంగేజ్మెంట్ ఇటీవల జరిగింది. మహతి స్వర సాగర్ కూడా సంగీత రంగంలోనే ఉన్నారు. చలో, భీష్మ, ఇటీవల వచ్చిన మాస్ట్రో ఇలా చాలా సినిమాలకు సంగీతం అందించారు. నితిన్ రాబోయే సినిమా మాచర్ల నియోజకవర్గం సినిమాకి కూడా సంగీత దర్శకత్వం అందిస్తున్నారు. ఎంగేజ్మెంట్ ఫోటోలని సోషల్ మీడియా వేదికగా మహతి స్వర సాగర్ షేర్ చేశారు.
Video Advertisement

మహతి స్వర సాగర్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సంజన కూడా ప్రముఖ గాయని. భీష్మ, చల్ మోహన్ రంగాతో పాటు ఇంకా చాలా తమిళ సినిమాల్లో సంజన పాటలు పాడారు. వీరిద్దరి పెళ్లి ఈనెల 24వ తేదీన చెన్నై లోని ది అకార్డ్ ఫంక్షన్ హాల్ లో జరగబోతోంది.
End of Article
