Ads
కొవిడ్ వల్ల జనాలు దూరంగా ఉంటున్నారు. ఎక్కడికి అయితే ఏం వ్యాధి వస్తుందన్న భయంతో ఒక వ్యక్తిని ఒక వ్యక్తి కలవడమే మానేశారు. ఇలాంటి సమయంలో కరోనా తో కోలుకుంటున్న ఒక పేషెంట్ కి ఒక మహిళ ఆటో డ్రైవర్ సహాయం చేశారు. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రి నుండి ఆ పేషెంట్ ని ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటన మణిపూర్ లో చోటుచేసుకుంది.
Video Advertisement
ఇంఫాల్‌లోని ప్రభుత్వ జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఒక పేషెంట్ కరోనా కి చికిత్స పొందుతున్నారు. పేషెంట్ ఇంఫాల్ కి చెందిన వారు కాదు. హాస్పిటల్ నుండి ఆవిడ ఉండే చోట ఎంతో దూరం. దాంతో హాస్పటల్ సిబ్బంది తనని ఇంటికి చేర్చేందుకు అంబులెన్స్ పంపించడానికి నిరాకరించింది.
అప్పుడే కోల్‌కతా నుండి తిరిగి వచ్చిన లైబీ ఓనమ్ అనే మహిళ ఆటో డ్రైవర్ ఆ పేషెంట్ ని దిగబెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పింది. మే 31 నుండి జూన్ ఒకటో తారీకు వరకు మధ్య రాత్రి సమయంలో 8 గంటలు ఆటో నడిపి ఆ పేషెంట్ ని ఇంట్లో వదిలిపెట్టింది. ఇదంతా లైబీ స్వచ్ఛందంగా చేసింది.
ఆ పేషెంట్ కి వైరస్ ఉంది అని తెలిసి కూడా తనకి సోకుతుంది ఏమో అని భయం లేకుండా లైబి ధైర్యంగా ఆటో నడిపి పేషెంట్ ని కమ్జోంగ్ జిల్లా లోని హెడ్క్వార్టర్స్లో దింపేసారు. మంచు చలి ఎక్కువైనా కూడా లెక్కచేయకుండా ఆటో నడిపారు.ఇదంతా తెలుసుకున్న మణిపూర్ చీఫ్ మినిస్టర్ ఎన్ బీరెన్ సింగ్ లైబి ని సత్కరించాలి అని నిర్ణయించుకున్నారు.
ట్విట్టర్లో మాట్లాడుతూ ‘జెఎన్‌ఐఎంఎస్ నుండి డిశ్చార్జ్ అయిన అమ్మాయిని తీసుకెళ్లడానికి హాస్పటల్ సిబ్బంది ఇబ్బంది పడిన కూడా ఏదీ లెక్కచేయకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పేషెంట్ ని ఇంటికి తీసుకెళ్లిన పంగేకు చెందిన ఆటో డ్రైవర్ శ్రీమతి లైబీ ఓనమ్ను 1,10,000 రూపాయల నగదు బహుమతితో గౌరవించడం ఆనందంగా ఉంది. ఇంఫాల్ నుండి కమ్‌జోంగ్‌కు ఎనిమిది గంటలపాటు ఆటో నడిపిన ఆమె కృషి సేవ ఎంతో అభినందనీయం’అని చెప్పారు.
లైబి కి ఇద్దరు కొడుకులు. ఇంట్లో సంపాదించేది ఆవిడ ఒక్కరే. ప్రధానమంత్రి ఇచ్చిన నగదుతో పాటు ఒక వ్యాపార సంస్థ కూడా తన సేవలను గుర్తించి లైబికి అవార్డును ప్రదానం చేసింది. తను సుపరిచితురాలు అయింది ఇప్పుడే కావచ్చు.కానీ, ముందు నుంచి కూడా లైబికి సామాజిక దృక్పథం ఎక్కువే.
తన గురించి ఎప్పుడో ఒక షార్ట్ ఫిలిం కూడా వచ్చింది. దాని పేరు ఆటో డ్రైవర్. 2015లో 63 వ జాతీయ అవార్డుల లో బెస్ట్ సోషల్ ఇష్యూ ఫిలిం ఇన్ నాన్ ఫీచర్ కేటగిరీ లో అవార్డు ను అందుకుంది. ఉమెన్స్ వాయిస్ నౌ ఫిలిం ఫెస్టివల్ లో ఆడియన్స్ ఛాయిస్ కేటగిరీలో బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం అవార్డు ను అందుకుంది.
End of Article