Ads
ఇటీవలి కాలంలో మిర్చి సినిమాతో నదియా, అజ్ఞాతవాసి సినిమాతో ఖుష్బూతో పాటు ఇంకా చాలా మంది హీరోయిన్లు కం బ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో హీరోయిన్ కూడా చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మన్మధుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ అన్షు ఇప్పుడు ఒక క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాతో కం బ్యాక్ ఇవ్వబోతున్నారట.
Video Advertisement
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి మరొక సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. హారిక హాసిని క్రియేషన్స్ పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. అయితే, ఇందులో ఒక ముఖ్య పాత్రలో అన్షు కనిపించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా? లేక పుకారా? అనే విషయం పై క్లారిటీ రావాలంటే అధికారికంగా ప్రకటించేంత వరకు ఆగాల్సిందే
End of Article