Home Filmy Adda త్రిష, చిరంజీవి విషయంలో అన్నంతపని చేసిన “మన్సూర్ అలీ ఖాన్”…ఏమైందంటే.?

త్రిష, చిరంజీవి విషయంలో అన్నంతపని చేసిన “మన్సూర్ అలీ ఖాన్”…ఏమైందంటే.?

by Sainath Gopi

ప్రముఖ తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ అనంతపని చేశాడు. మెగాస్టార్ చిరంజీవి పైన పరువు నష్టం దావా వేశాడు. చిరంజీవితోపాటు త్రిష, ఖుష్బూ పై కూడా కేసు పెట్టాడు. తనకి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టును కోరాడు. తనకు సంబంధించిన వీడియో పూర్తిగా చూడకుండా తనపై ఆరోపణలు చేసి తన పరువుకు నష్టం కల్పించారని ఆరోపించాడు. అయితే ఈ కేసు డిసెంబర్ 11వ తారీఖున మద్రాస్ హైకోర్టు ముందుకు రానుంది.

chiranjeevi mansoor ali khan

అసలు విషయంలోకి వెళ్తే మన్సూర్ అలీ ఖాన్ నటి త్రిష పైన సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను గతంలో ఎన్నో సినిమాల్లో రేప్ సీన్లలో నటించానని కానీ లియో సినిమాలో త్రిషతో తనకి ఆ అవకాశం రాకపోవడం నిజంగా బాధపడినట్లు ప్రకటించాడు. అయితే మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యల పైన మహిళా సంఘాలతో పాటు చాలామంది ప్రముఖులు తీవ్రంగా మండిపడ్డారు. త్రిష అయితే మన్సూర్ తో ఒక్క సినిమాలో కూడా నటించనందుకు చాలా సంతోషం అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే త్రిషకు మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు లోకేష్, కార్తీక్ సుబ్బరాజ్, మాళవిక, రోజా, సింగర్ చిన్మయి, నితిన్, రాధా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు మద్దతుగా నిలిచారు. ఖుష్బూ అయితే తమిళనాడు డిజిపి కి ఫిర్యాదు చేయగా మన్సూర్ పైన కేసు కూడా నమోదు చేశారు. అయితే మన్సూర్ తనని అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ అప్లై చేయగా కోర్టు దాన్ని తిరస్కరించింది.

mansoor ali khan reply to trisha comments

అయితే మనసూర్ వ్యాఖ్యల పైన తీవ్ర నిరసన రావడంతో త్రిషాకి మన్సూర్ క్షమాపణలు చెప్పాడు. త్రిష ఆ క్షమాపణను అంగీకరించింది. అయితే తర్వాత మన్సూర్ తన పరువు కి నష్టం కలిగించారు అంటూ చిరంజీవి పైన, త్రిష పైన, ఖుష్బు పైన పరువు నష్టం దావ వేస్తానంటూ ప్రకటించాడు. ఇప్పుడు నిజంగా పరువు దావా వేసి అనంతపని చేశాడు.

You may also like