రంగారెడ్డి మంత్రాల ఎల్లమ్మ గుడిలో హుండీ చోరీ…సీసీటీవీ కెమెరాకి చిక్కిన దొంగలు!

రంగారెడ్డి మంత్రాల ఎల్లమ్మ గుడిలో హుండీ చోరీ…సీసీటీవీ కెమెరాకి చిక్కిన దొంగలు!

by Megha Varna

Ads

ఈ రోజుల్లో వివిధ పరిస్థితుల కారణంగా నేర ప్రవృతి బాగా పెరుగుతుంది.డబ్బులు ఈజీ గా సంపాదించడినికి దొంగతనాలు ,చోరీలకు పాల్పడుతున్నారు.కానీ పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ఇలా నేరాలకు పాల్పడినవాళ్లు వెంటనే పోలీసులకు దొరికిపోతున్నారు.అయితే తాజాగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంతెన గౌరెల్లి గ్రామంలో మంత్రాల ఎల్లమ్మ దేవాలయంలో చోరీ జరిగింది.ఈ ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Video Advertisement

లాక్ డౌన్ కారణంగా సామాజిక దూరాన్ని భంగం కలిగించే సినిమా థియేటర్స్ ,రెస్టారెంట్స్ ,మాల్స్ ,కాలేజీలు అలాగే దేవాలయాలను కూడా మూసివేసిన సంగతి తెలిసిందే.కాబట్టి ఈ సమయంలో దేవాలయానికి అర్చకులు ,భక్తులు కూడా రాకుండా కాలిగా ఉన్నాయి.ఇదే సరైన సమయం అనుకున్నారు ఇద్దరు వ్యక్తులు.దేవాలయంలోకి రహస్యంగా ప్రవేశించి హుండీని పగలకొట్టి అందులో ఉన్న డబ్బులు మరియు వివిధ కనుకులను దొంగలించారు.అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.వెంటనే ఆలయానికి సంబందించిన సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించాగా అందులో చోరీ ఎలా జరిగింది ఏవరు చేసారు అనే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

చోరీకి పాల్పడ్డ వ్యక్తులు మర్రిగూడ మండలం గుండ్లపల్లి గ్రామస్థులు అని అభిప్రాయపడుతున్నారు.అయితే నేరానికి పాల్పడిన వారిని త్వరలోనే గుర్తించి వారిపై కేసు నమోదు చేస్తామని స్థానిక సిఐ వెల్లడించారు.పవిత్ర స్థలములు ఐన దేవాలయాలను కూడా దోపిడీ చేసేవారు చాలామందే ఉన్నారని అలంటి వారిని కఠినంగా శిక్షించాలని మళ్ళీ ఇలా ఎవరూ దేవాలయాలను చోరీ చెయ్యకూడదని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


End of Article

You may also like