చనిపోతే దూరం నుండి కూడా చూడనివ్వట్లేదు…క్రేన్లతో పూడ్చేస్తున్నారు! యూఎస్ లో దీన స్థితిపై మాజీ హీరోయిన్!

చనిపోతే దూరం నుండి కూడా చూడనివ్వట్లేదు…క్రేన్లతో పూడ్చేస్తున్నారు! యూఎస్ లో దీన స్థితిపై మాజీ హీరోయిన్!

by Megha Varna

Ads

ప్రపంచ దేశాలని శాసించే అగ్రరాజ్యం అమెరికా …ఇప్పుడు ఈ కరోనా వైరస్ తో అగ్రరాజ్యం విలవిలాడుతోంది.చనిపోయిన వారి మృత దేహాన్ని కడసారి చూసుకోవడానికి కూడా అయినవారిని అనుమతించక పోవడంతో అక్కడి వారు తీవ్ర మనోవేదన కు లోనవుతున్నారు ..సీతారామరాజు సినిమాలో నాగార్జున సోదరిగా నటించి అప్పట్లో సిస్టర్స్ క్యారెక్టర్స్ కి స్పెషల్ ఆర్టిస్ట్ గా నిలిచిన మాన్య. అలాగే తమిళ్ మలయాళం భాషల్లో హీరోయిన్ గా కూడా కొన్నాళ్లపాటు కొనసాగింది.ఆమె ప్రస్తుతం న్యూయార్క్ లో ఉంటుంది .కాగా ఆమె అక్కడి కరోనా పరిస్థితి గురించి తనదైన బాణీలో వివరంగా చెప్పింది .ప్రస్తుతం ఆమె అమెరికాలో ఆర్ధిక నిపుణిరాలుగా పని చేస్తుంది . .ఈ నేపథ్యంలో అక్కడి వారి దయనీయ పరిస్థితుల గురించి వివరించింది .

Video Advertisement

మాన్య మీడియాతో మాట్లాడుతూ …అమెరికాలో ఎక్కడ చూసినా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది..అనుకోని విధంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా సరిఅయిన ఆరోగ్యం కలిగి ఉన్న వారిని కూడా ఈ వైరస్ వదలడం లేదు ..సామజిక దూరం పాటిస్తూ వీలైనంత వరుకు ఇంట్లో ఉంటేనే మంచిది . కరోన వచ్చి మరణిస్తే బంధుమిత్రులు కడసారి చూసే అవకాశం లేదు ..క్రేన్లతోనే శవాలను పూడ్చేస్తున్నారు .కాగా నా ఫ్రెండ్ ఫాథర్ తాజాగా కరోనా బారిన పడి మరణించగా ఆయనను ఆఖరిసారి చూసేందుకు కూడా అనుమతించలేదు అని చెప్పారు మాన్య ..కనీసం దూరం నుండి చూడడానికి కూడా సాధ్యం అవ్వలేదు ..ఆ విధంగా ఇక్కడి పరిస్థితులు చేజారిపోయాయి . అందుకే ఎటువంటి పరిస్థితులలో  అయినా సరే బయటకు రాకుండా ఉండడమే మంచిది  అని మాన్య వివరించింది

watch video:

 


End of Article

You may also like