పెళ్ళికి ఒప్పుకోలేదని…బస్సు కోసం ఎదురుచూస్తున్న మరదలిని ఆమె బావ ఏం చేసాడో తెలుసా?

పెళ్ళికి ఒప్పుకోలేదని…బస్సు కోసం ఎదురుచూస్తున్న మరదలిని ఆమె బావ ఏం చేసాడో తెలుసా?

by Megha Varna

Ads

బస్సు కోసం ఎదురు చూస్తున్న ఓ యువతిని అందరూ చూస్తుండగానే కొందరు అపహరించుకుపోయారు. ఆ యువతిని కారులోకి లాక్కెళ్లగా, వారిలో ఒకరు ఆమెకు బలవంతంగా తాళి కట్టారు. ఈ ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు (23) బస్‌స్టాప్‌లో ఎదురుచూస్తున్న సమయంలో కొందరు యువకులు కారులో అక్కడికి చేరుకున్నారు. అందరూ చూస్తుండగానే బలవంతంగా ఆమెను కారులోకి ఎక్కించారు ఆమెకి బావ వరుస అయ్యే మను (30) అనే ఆమె మెడలో తాళి కట్టాడు. తాళిక‌ట్టే స‌మ‌యంలో యువ‌తి క‌ద‌ల‌కుండా మ‌ను స్నేహితుడు గ‌ట్టిగా ప‌ట్టుకున్నాడు.

Video Advertisement

ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువతిని మను తన స్నేహితుడి వద్ద దాచినట్లు ఆరోపించారు. కేసు నమోదు చేసిన అధికారులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.పెళ్లి చేసుకోవాలంటూ మను ఏడాదిగా ఆమె వెంట పడుతున్నాడు. అయితే, ఆమె మాత్రం తిరస్కరిస్తూ వచ్చింది. దీంతో ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించి ఇలా చేసాడు.

ఈ దృశ్యాల‌ను సెల్‌ఫోన్‌లో బంధించిన మ‌ను మ‌రో స్నేహితుడు సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. యువ‌తి త‌ల్లిదండ్రుల మేర‌కు కేసు ద‌ర్యాప్తు చేసిన పోలీసులు మ‌నుతోపాటు అత‌ని స్నేహితులు ప్రవీణ్‌ కుమార్, టీఎన్ వినయ్‌ల‌ను అరెస్టు చేశారు. కారు డ్రైవ‌ర్ కేఏ సందీప్ ప‌రారీలో ఉన్న‌ట్టు పోలీసులు తెలిపారు.ఈ దృశ్యాల‌ను సెల్‌ఫోన్‌లో బంధించిన మ‌ను మ‌రో స్నేహితుడు సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. యువ‌తి త‌ల్లిదండ్రుల మేర‌కు కేసు ద‌ర్యాప్తు చేసిన పోలీసులు మ‌నుతోపాటు అత‌ని స్నేహితులు ప్రవీణ్‌ కుమార్, టీఎన్ వినయ్‌ల‌ను అరెస్టు చేశారు. కారు డ్రైవ‌ర్ కేఏ సందీప్ ప‌రారీలో ఉన్న‌ట్టు పోలీసులు తెలిపారు.

watch video:


End of Article

You may also like