కిమ్ చనిపోయినట్టు పుకార్లు పుట్టించింది అందుకేనా? మాములు ప్లానింగ్ కాదుగా!!!

కిమ్ చనిపోయినట్టు పుకార్లు పుట్టించింది అందుకేనా? మాములు ప్లానింగ్ కాదుగా!!!

by Megha Varna

Ads

ఒకప్పుడు రాజులు తమ రాజ్యంలో తమను వెన్నుపోటు పొడిచే వారు ఎవరో తెలుసుకోడానికి తమ డూప్ లను వారే తయారు చేయించుకునేవారు. ఇప్పుడు కిమ్ వేసిన ప్లాన్ చూస్తే అందరికి అదే గుర్తొస్తుంది.పూర్వకాలం లో రాజులు చనిపోయినట్టు వార్తలు సృష్టించి వారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి రాజ్యంలో జరుగుతున్నా పరిస్థితులను వీక్షిస్తూ ఉంటారు.అప్పటికే ఆ పదివిపై కన్నేసి ఉన్నవాళ్లు శత్రువులతో చెయ్యి కలిపి రాజ్యానికి సంబందించిన రహస్యాలను వారితో పంచుకుంటారు.సరి అయినా సమయంలో రాజు హీరోలాగా గ్రాండ్ ఎంట్రన్స్ ఇస్తాడు .వినడానికి పాత కధల ఉన్న కూడా ఎప్పుడు వర్కౌట్ అయ్యే పెద్ద వ్యూహం ఇదే.

Video Advertisement

గతంలో నియంతలు అయినా హిట్లర్ ,సార్ధం హుస్సేన్ కూడా ఇలాగె చనిపోయినట్టు వార్తలు సృష్టించి తమ డూపులను రంగంలోకి దింపి హై డ్రామా చేసేవారు.సరిగ్గా ఎలాంటి వ్యూహాన్నే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అవలంబిస్తున్నట్లుగా కొన్ని పత్రికలు కధనాలు ప్రచురించాయి.కాగా స్కై న్యూస్ ఆస్ట్రేలియా కొన్ని ఆధారాలతో కూడా ఈ వార్తను ధ్రువీకరించాయి.కిమ్ జోంగ్ ఉన్ చనిపోయాడు అని వార్తలు వచ్చాక తన వారసుడిగా కిమ్ యో జోంగ్ ను ప్రకటించేందుకు వర్కర్స్ పార్టీ లో ఉన్న ప్రముఖులు ప్రయత్నించారని తెలిసింది.దీంతో అసలు శత్రువులు ఎవరో కిమ్ జోంగ్ ఉన్ కు తెలిసినట్లుగా ఇప్పటిదాకా అందుతున్న రహస్య సమాచారం .

కాగా ఈ మధ్యకాలంలో కిమ్ ఆరోగ్యం క్షిణించింది అని హృదయానికి సంబందించిన వ్యాధులతో బాధపడుతున్నారని ఇంకా బతకడం కష్టం అని వార్తలు వచ్చాయి.ఈ వార్తలన్నీ అవాస్తవమనిపించేలా కిమ్ ఈమధ్య కాలంలో ఒక షాప్ ఓపెనింగ్ కి విచ్చేసి అందరిని ఆశ్చర్యపరిచేలా చేసారు.కానీ ఆ షాప్ ఓపెనింగ్ లో కనిపించింది కిమ్ కాదని ఎందుకంటే కిమ్ పళ్ళ వరస తేడాగా ఉందని ఆ ఫోటోలను జతచేస్తూ కొంతమంది ట్విట్టర్ ద్వారా తెలిపారు.అసలు ఈ కిమ్ ప్లాన్ ఎంతోగాని అంతా ఒక మిస్టరీల ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు .


End of Article

You may also like