లాక్ డౌన్ వేళ పెళ్లికోసం సైకిల్ పై 7 రోజులు 800 కిమీ…చివరికి చేరువలో ఉండగా ట్విస్ట్.!

లాక్ డౌన్ వేళ పెళ్లికోసం సైకిల్ పై 7 రోజులు 800 కిమీ…చివరికి చేరువలో ఉండగా ట్విస్ట్.!

by Megha Varna

Ads

కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో  ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న వారి పెళ్లిళ్లు వాయిదా పడగా కొత్తగా వివాహం చేసుకుందాం అనేవారికీ నిరాశే మిగిలింది ..ఈ లాక్ డౌన్ తర్వాత కూడా ముహుర్తాలు లేకపోవడంతో ఇంకా చాలా కాలం వేచి ఉండాల్సి ఉంది ..ఈ నేపథ్యంలో ఓ యువకుడు పెళ్లి కోసమని సైకిల్ మీద వెళ్తుండగా అనుకోని పరిస్థితుల్లో క్వారంటైన్ సెంటర్ కు వెళ్లాల్సి వచ్చింది ..వివరాల్లోకి వెళ్తే..

Video Advertisement

ఉత్తరప్రదేశ్ కు చెందిన సోనుకుమార్ చౌహన్ అనే 24 ఏళ్ళ యువకుడు పంజాబ్ లోని లుధియానాలోని టైల్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు ..దేశంలో కరోనా ప్రభావం రాకముందు అంటే ఏప్రిల్ 15 న సోను పెళ్లి నిశ్చితార్థం జరిగింది .అయితే తర్వాత విధించిన లాక్ డౌన్ కారణంగా సోను పంజాబ్ లోనే చిక్కుకుపోయారు .

representative image

ఈ నేపథ్యంలో పెళ్లి సమయం దగ్గరపడడంతో ఎలాగైనా వెళ్లాలని నిశ్చయించుకున్నాడు.కానీ  ఎలాంటి రవాణా మార్గాలు లేకపోవడంతో సైకిల్ పై అతని స్నేహితులతో కలిసి ప్రయాణం చేసేందుకు సిద్ధపడ్డాడు .కాగా నేపాల్ సరిహద్దులో ఉన్న మహారాజగంజ్ జిల్లాలో సోను పెళ్లి జరగనుంది .దీంతో తన ముగ్గురి స్నేహితులతో కలిసి రాత్రి ,పగలు అనే తేడా లేకుండా దాదాపు 850 కిలోమీటర్లు ప్రయాణం చేసాడు.ఇంకా 150 కిలోమీటర్లు వెళ్తే మహారాజగంజ్ చేరుకునేవాడు కానీ అంతలోపే ఆదివారం ఉదయం ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ దగ్గరకు రాగానే పోలీస్ లకు దొరికిపోయాడు …

representative image

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అందరు సామజిక దూరం పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించగా ఇలాంటి సమయంలో రూల్స్ ను అతిక్రమించి ఇలా ప్రయాణం చేయడమేంటనీ ఆగ్రహించిన పోలీసులు సోనుతో సహా మిగతా ముగ్గురిని క్వారంటైన్ కు తరలించారు . ఇదే విషయమై సోనూ చౌహాన్‌ను అడగగా .. “ఈ సమయంలో ఇలాంటి ప్రయాణం చేయడం రిస్కే. కానీ పెళ్లి కావడంతో ఈ పని చేయాల్సి వచ్చింది. ఇంకో 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మా ఊరికి వెళ్లేవాడిని. కానీ పోలీసు అధికారులు అడ్డుకొని ఇప్పుడు నీ పెళ్లి కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారని” ఆవేదన వ్యక్తం చేశాడు.




ఇదే విషయమై బలరాంపూర్‌ ఎస్పీ దేవ్‌ రాజన్‌ వర్మ స్పందిస్తూ .. “బలరాంపూర్‌ జిల్లా సరిహద్దుకు వద్దకు రాగానే సోనూ చౌహాన్‌తో పాటు మిగతా ముగ్గురిని క్వారంటైన్‌కు తరలించాం. 14 రోజుల క్వారంటైన్‌ అనంతరం కరోనా పరీక్షలో నెగిటివ్‌ వస్తే వారిని వదిలేస్తాం.అంతవరకు క్వారంటైన్‌లో ఉండాల్సిందే” అని వెల్లడించారు .


End of Article

You may also like