కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.దీంతో కాలేజీలు ,ఆఫీసులు ,రవాణా మార్గాలు అన్ని కూడా ఆపివేశారు.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఇప్పటికే పెళ్లి ముహర్తలు పెట్టుకున్నవారు క్యాన్సిల్ చేసుకోగా ..ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్నవాళ్ళు కూడా పెళ్లిని వాయిదా వేసుకున్నారు.పెళ్లి కానీ వారు అయితే ఎప్పుడు లాక్ డౌన్ ఎత్తివేస్తారా అని నిస్సహాయంగా ఎదురుచూస్తున్నారు.కొంతమంది అయితే ఆన్లైన్ లోనే పెళ్లి చేసుకోవడం ,మొబైల్ కి తాళి కట్టడం లాంటి సంఘటనలు చూస్తున్న ఉన్నాం ..

Video Advertisement

representative image

లాక్ డౌన్ కారణంగా దేశమంతటా విచిత్రమైన సంఘటనలు చూస్తూనే ఉన్నాం.ఈ నేపథ్యంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటకు మహారాష్ట్ర నాసిక్ లోని పోలీసులు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తూ రిసెప్షన్ ను సిద్ధం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తేగా వైరల్ అవుతుంది ..ఇంస్టాగ్రామ్ యాప్ లో షేర్ చేసిన ఈ వీడియో దాదాపు రెండు నిముషాలు ఉంటుంది .ఒక పోలీస్ మరియు అతని చుట్టూ చాలామంది పోలీసులు చుట్టుముట్టి ఉంటారు ..లౌడుస్పీకెర్ లో కొత్త జంటను పోలీసులు అభినందించడం చూడవచ్చు ..

ఈ జంట తమ ఇంటి బాల్కనీ లో నిలబడి ఉంటారు ..పోలీసులు బాలీవుడ్ సినిమాలో లాగా ఒక సాంగ్ ని బాక్రౌండ్ లో ప్లే చేస్తారు.ఈ జంట కోసం చప్పట్లు కొట్టండి అని లౌడుస్పీకెర్ లో చెప్పగా అందరు పోలీసులు చప్పట్లతో ఆ ప్రాంగణం అంత మారుమోగిస్తారు.చుట్టూ ఉన్నవారు తమ మొబైల్ ఫోన్స్ తో ఈ దృశ్యాన్ని రికార్డు చేస్తూ ఉంటారు.ఈ వీడియో ను చీఫ్ మినిస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాసిక్ పోలీస్ స్టైల్ లో “ఇంట్లో వివాహం చేసుకున్న జంటను అభినందిస్తున్నాము “అని తెలిపారు.

లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించకుండా ఓ జంట ఇంట్లో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది .కాబట్టి కొత్త జంటను అభినందించేందుకు నాసిక్ పోలీసులు సిద్ధపడ్డారు.కాగా భారతదేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదు అయ్యాయి.దాదాపు 13 వేళా మంది కరోనా బారిన పడగా 548 మంది మరణించారు.