ఇదేమి వింత ఆచారమో.. అక్కడ దెయ్యాలకు కూడా పెళ్లిళ్లు చేస్తారట..!

ఇదేమి వింత ఆచారమో.. అక్కడ దెయ్యాలకు కూడా పెళ్లిళ్లు చేస్తారట..!

by Megha Varna

ఈ మధ్య కాలంలో కూడా వింత ఆచారాలు, మూఢనమ్మకాలు పోవడం లేదు. ఇంకా కొందరు దెయ్యాలను కూడా నమ్ముతారు పైగా చాలామంది దెయ్యాలంటే భయపడతారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తయితే చైనాలో మాత్రం ఏకంగా దెయ్యాలతోనే పెళ్లి చేస్తారు. మరి ఆ దెయ్యాల సంప్రదాయం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.

Video Advertisement

పెళ్లి కాని అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళు ప్రేతాత్మలుగా మారడం మనం సినిమాల్లో చూసే ఉంటాం. అదేవిధంగా చైనాలో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఓ యువతి పెళ్లి కాకుండానే ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇలా కోపంతో రగులుతున్న ఆత్మలకి పెళ్లి చేయడం ద్వారా ఆత్మలు శాంతిస్తాయి అని వాళ్ళ నమ్మకం.

అందుకే వాళ్ళు పెళ్లి కాకుండా చనిపోయిన రెండు ఆత్మల అస్తికలు తీసుకుని మంత్ర పూజలు చేస్తారు. సోషల్ మీడియాలో లక్షల మంది అభిమానులు వున్న ఓ యువతి చనిపోయింది. అంత మంది అభిమానులు ఉండగా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరపడం.. ఆ తర్వాత ఆ యువతి అస్తికలను ఒక యువకుడు దొంగలించి అమ్మడం జరిగింది.

దెయ్యాలకి పెళ్లి చేయాలని వాళ్ళు అనుకుని పెళ్లి జరిపించారు. చైనాలో ఈ ఆచారం మూడు వేల సంవత్సరాలుగా సాగుతోంది. ఇలాంటి పెళ్లిళ్లు చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు జరిపిస్తూ ఉంటారు. వాళ్లే ఆత్మ కోసం వెతుకుతారు. అయితే ఈ ఆచారాన్ని చైనా కొన్ని దశాబ్దాల పూర్వమే నిషేధించింది.

కానీ వారి నమ్మకాలు ఉంటాయి కదా రహస్యంగా కానిచ్చేస్తున్నారు. చైనా అమ్మాయి చనిపోయాక అస్తికలు దొంగలించిన అతన్ని, వాటిని అమ్మడానికి చూసిన వాళ్ళని అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా ఈ సంగతి నెట్టింట్లో వైరల్ గా మారింది.


You may also like