Ads
ప్రేమ అంటూ వెంటపడడం… ఆ తర్వాత నమ్మించి మోసం చేయడం ఇలాంటివి ప్రతిరోజు మనకి కనబడుతూనే ఉంటాయి. ప్రేమ పేరుతో మోసపోయిన యువతులు చాలా మంది ఉన్నారు. రోజు రోజుకీ ఇవి పెరిగిపోతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు. శారీరక అవసరాలను తీర్చుకోవడానికి ప్రేమ అనే పేరుతో యువతులను మోసం చేస్తున్నారు.
Video Advertisement
ఆ తర్వాత వాళ్ళతో ఎటువంటి సంబంధం లేదు అన్నట్టే ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాంటి మోసం చేసిన యువకుడిపై పోలీసులు బుద్ధి చెప్పారు. ఎక్కడో కాదండీ ఇది తమిళనాడు లోని కడలూరులో చోటు చేసుకుంది.
విరుధచలం సమీపంలో ఒక గ్రామానికి చెందిన వేల్ మురుగన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. అతని వయసు 36 ఏళ్లు. 27 ఏళ్ల యువతి అయిన సత్యతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత పరిచయంని కాస్త ప్రేమగా మార్చుకున్నాడు. వీళ్లిద్దరి మధ్య రోజు రోజుకి ప్రేమ పెరిగింది.
representative image
సుమారు రెండు సంవత్సరాల నుండి కూడా వీళ్ళు లవ్ లో ఉన్నారు. అయితే పెళ్లి చేసుకుంటానని చాలా సార్లు చెప్పాడు. ఇరువురు కూడా పలుమార్లు శారీరికంగా కలిశారు. దీనితో ఆమె గర్భం దాల్చింది. అబార్షన్ చేయించుకోమని ఆమెని అన్నాడు. దీనికి ఆమె అస్సలు ఒప్పుకోలేదు. అప్పుడు తెలిసింది ఆమెకి అవసరం తీరిపోయాక వదిలేస్తున్నాడు అని.
representative image
నెలలు నిండుతున్నాయి… పురిటి నొప్పులు కూడా వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు ఆమెని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఇక్కడ అసలు ట్విస్ట్ మొదలైంది. ఆస్పత్రిలో సత్యని తండ్రి పేరు అడిగారు. అయితే నిజం చెప్పడం తప్పలేదు. ఆమెకి పెళ్లి కాకుండానే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది అని యూ. మంగళం పోలీసులకి ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఆస్పత్రికి వచ్చి విచారించారు. సత్య చెప్పింది నిజమేనని అతనే మోసం చేశాడని పోలీసులు తెలుసుకొని మోసం చేస్తే అరెస్టు చేస్తామని చెప్పారు. దీనితో అతను పెళ్లికి ఒప్పుకున్నాడు.
End of Article