Ads
పెళ్లయిన తర్వాత ఈ భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే తన భర్త బయటికి వెళ్లినప్పుడు ఆమె స్మార్ట్ ఫోన్ తో కాలక్షేపం చేసేది. అదే కొంపముంచింది. అసలు ఏమైంది అనేది చూస్తే..
Video Advertisement
వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండకి చెందిన ఒక యువతికి 4 నెలల క్రితం హనుమకొండలో పెళ్లయింది. అయితే మొదట్లో ఈమె తన భర్తతో పాటు ఎంతో ఆనందంగా ఉండేది. భర్త బయటకు వెళ్లడంతో ఈమె స్మార్ట్ ఫోన్ తో కాలక్షేపం చేసేది. ఈ క్రమంలో వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని సింగం పేట గ్రామానికి చెందిన యువకుడితో ఈ మధ్యే ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.
ఇంకేముంది కాపురం దీనివల్ల నాశనమైపోయింది. తెలిసీ తెలియక చేసిన స్నేహం వలన కాపురంలో చిచ్చు పెట్టింది. సందీప్ ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తూ ఉండేవాడు. అయితే ఫేస్ బుక్ ద్వారా ఈమెకు సందీప్ పరిచయమయ్యాడు. చాటింగ్ మొదలు కాల్స్ వరకు ఎంతో దగ్గరయ్యారు. భర్త ఇంట్లో లేని సమయం చూసుకుని గంటలకొద్దీ ఈమె ఫోన్ మాట్లాడేది. వీడియో కాల్స్ కూడా చేసుకునేవారు.
కొన్ని రోజుల తర్వాత ప్రేమ బాగా పెరగడంతో భర్తతో కలిసి ఉండలేనని తన అభిప్రాయాన్ని చెప్పింది. ఆ తర్వాత ప్రియుడిని వెతుక్కుంటూ సింగం పేట గ్రామానికి వెళ్ళింది. ప్రియుడు కూడా ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇరవై రోజుల నుండి ఇద్దరు కలిసి ఉంటున్నారు.
తన కూతురు చేసిన ఈ పనికి తల్లి హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెను పిలిపించి విచారించారు. నిందితుడు పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆమెను తిరిగి తీసుకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది భర్తకి. ఫేస్బుక్ ద్వారా ఏర్పడిన చిన్న పరిచయం కాస్తా కాపురాన్ని నాశనం చేసింది.
End of Article