నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు,కూతురు కులాంతర వివాహం చేసుకోవడం సహించలేని మారుతీరావు మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని అతి దారుణంగా కత్తితో నరికి నడి రోడ్డుపై హత్య చేయించాడు. ప్రణయ్, అమృతలు 2018 జనవరి 31న ప్రేమ వివాహం చేసుకోగా సెప్టెంబర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మారుతీ రావు హత్య చేయించారు. అయితే ప్రణయ్ పై దాడి జరిగిన సమయంలో అమృతవర్షిణి పక్కనే ఉంది.
ఈ కేసులో మారుతీరావు A1గా, అతని తమ్ముడు శ్రవణ్ A2గా ఉన్నారు. ఈ కేసులో ఆయన బెయిల్‌పై బయట ఉన్నాడు. కూతురు దూరం కావడంతో పాటు కేసులు పెట్టడంతో మనస్తాపానికి గురైనట్లు.ఈ తరుణంలో ఆయన హైదరాబాద్‌లోని చింతల్‌బస్తీలోని ఆర్యవైశ్య భవన్లో ఓ గదిని అద్దెకు తీసుకుని రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. హౌస్ కీపింగ్ సిబ్బంది డోర్ తట్టగా తీయకపోయేసరికి తలుపులు పగలగొట్టి చూడగా విగతజీవిగా పడివున్నాడు.
శనివారం సాయంత్రం కి మారుతీ రావు హైద్రాబాద్ ఆర్యవైశ్య భవనానికి వచ్చారు. రూమ్ నెంబర్ 306 ను అద్దెకు తీసుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో డ్రైవర్‌తో కలిసి మారుతీరావు బయటకు వెళ్లి వచ్చాడు. ఓ లాయర్ ని కలిసే పని మీద ఆయన హైదరాబాద్ కి వచ్చారంట. ఆదివారం నాడు ఉదయం 8 గంటలకే తనను నిద్ర లేపాలని డ్రైవర్ కు చెప్పారు.
ఆదివారం ఉదయం డ్రైవర్ రూమ్ దగ్గరకి వచ్చి తలుపు తట్టినా మారుతీరావు తలుపులు తీయలేదు. ఆర్యవైశ్య భవన్ సిబ్బందితో కలిసి డ్రైవర్ తలుపులు బద్దలు కొట్టాడు. అప్పటికే అతను మరణించి ఉన్నాడు.మారుతీరావు శనివారం నాడు సాయంత్రం గారెలు తిన్నాడు.ఆ తర్వాత విషం తీసుకున్నాడు అని అన్నారు. విషం తీసుకున్నాక వాంతులు చేసుకున్నారట. కానీ ఆ విషం బాటిల్ మాత్రం దొరకలేదు. దీంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయ్యింది. మారుతీ రావు భార్యకు ఆయన మూర్తదేహాన్ని అందచేశారు.