మారుతీరావు ఆత్మహత్యపై సంచలన విషయాలు బయటపెట్టిన డ్రైవర్…ఆ షాప్ దగ్గర ఆగి?

మారుతీరావు ఆత్మహత్యపై సంచలన విషయాలు బయటపెట్టిన డ్రైవర్…ఆ షాప్ దగ్గర ఆగి?

by Sainath Gopi

మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్న విషయం ప్రస్తుతం ఎంత హల్చల్ అవుతుందో అందరికి తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసారు పోలీసులు. శనివారం సాయంత్రం కి మారుతీ రావు హైద్రాబాద్‌ ఆర్యవైశ్య భవనానికి వచ్చారు. రూమ్ నెంబర్ 306 ను అద్దెకు తీసుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో డ్రైవర్‌తో కలిసి మారుతీరావు బయటకు వెళ్లి వచ్చాడు. ఓ లాయర్ ని కలిసే పని మీద ఆయన హైదరాబాద్ కి వచ్చారంట. ఆదివారం నాడు ఉదయం 8 గంటలకే తనను నిద్ర లేపాలని డ్రైవర్ కు చెప్పారు.

ఆదివారం ఉదయం డ్రైవర్ రూమ్ దగ్గరకి వచ్చి తలుపు తట్టినా మారుతీరావు తలుపులు తీయలేదు. ఆర్యవైశ్య భవన్ సిబ్బందితో కలిసి డ్రైవర్ తలుపులు బద్దలు కొట్టాడు. అప్పటికే అతను మరణించి ఉన్నాడు.మారుతీరావు శనివారం నాడు సాయంత్రం గారెలు తిన్నాడు.ఆ తర్వాత విషం తీసుకున్నాడు అని అన్నారు. విషం తీసుకున్నాక వాంతులు చేసుకున్నారట. కానీ ఆ విషం బాటిల్ మాత్రం దొరకలేదు. ఇప్పుడు మారుతీ రావు కార్ డ్రైవర్ కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు.

మిర్యాలగూడ నుండి హైదరాబాద్ కి వచ్చే దారిలో ఓ పురుగుల దుకాణం ముందు కారు ఆపమని మారుతీరావు కోరినట్లు డ్రైవర్ చెప్పారు. అయితే ఆ దుకాణం ముందు చాలా సేపు నించున్నారు కానీ లోపలికి వెళ్ళలేదు అంట. గతంలో కూడా చాలాసార్లు మారుతీ రావు ఆ దుకాణం కి వెళ్ళారంట.

శనివారం రాత్రి హైదరాబాద్ కి చేరుకున్నాక ఇద్దరు కలిసి టిఫన్ చేసారంట. తర్వాత మారుతీ రావు రూమ్ కి వెళ్ళారంట. కొద్దిసేపటికి తనకు ఇష్టమైన గారెలు తెప్పించుకొని మారుతీరావు తిన్నాడని డ్రైవర్ తెలిపారు. తనని గదిలో వద్దని కారులోనే పడుకోమని చెప్పారంట మారుతీ రావు. పోలీసులు మరోసారి డ్రైవర్ ని విచారించే అవకాశం ఉంది. అతని కాల్ డేటా కూడా చెక్ చేసే అవకాశం ఉంది. మారుతీ రావు ఆత్మహత్యపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

You may also like