మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్న విషయం ప్రస్తుతం ఎంత హల్చల్ అవుతుందో అందరికి తెలిసిందే. శనివారం సాయంత్రం కి మారుతీ రావు హైద్రాబాద్ ఆర్యవైశ్య భవనానికి వచ్చారు. రూమ్ నెంబర్ 306 ను అద్దెకు తీసుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో డ్రైవర్‌తో కలిసి మారుతీరావు బయటకు వెళ్లి వచ్చాడు. ఓ లాయర్ ని కలిసే పని మీద ఆయన హైదరాబాద్ కి వచ్చారంట. ఆదివారం నాడు ఉదయం 8 గంటలకే తనను నిద్ర లేపాలని డ్రైవర్ కు చెప్పారు.
ఆదివారం ఉదయం డ్రైవర్ రూమ్ దగ్గరకి వచ్చి తలుపు తట్టినా మారుతీరావు తలుపులు తీయలేదు. ఆర్యవైశ్య భవన్ సిబ్బందితో కలిసి డ్రైవర్ తలుపులు బద్దలు కొట్టాడు. అప్పటికే అతను మరణించి ఉన్నాడు.మారుతీరావు శనివారం నాడు సాయంత్రం గారెలు తిన్నాడు.ఆ తర్వాత విషం తీసుకున్నాడు అని అన్నారు. విషం తీసుకున్నాక వాంతులు చేసుకున్నారట. కానీ ఆ విషం బాటిల్ మాత్రం దొరకలేదు. దీంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
విషం కారణంగానే ఆయన మృతి చెందినట్టు పోస్టుమార్టం లో తేల్చారు. కారులో కానీ, ఆయన గదిలో కానీ విషం బాటిల్ దొరకలేదు. ఈ విషం బోటిల్ కోసం చ్లుఎస్ టీం వెతుకుతున్నారు. ఈ నెల 7వ తేదీ రాత్రి 8:22 గంటలకు మారుతీరావు చివరి సారిగా తన లాయర్ తో ఫోన్ మాట్లాడారు మారుతీ రావు. ఆదివారం ఉదయం ఆయనకు కలవాల్సి ఉంది. కానీ ఇంతలో మారుతీ రావు ఇలా చేసేసరికి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మారుతీరావు అంత్యక్రియలు మిర్యాలగూడలో పూర్తయ్యాయి. కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తమ్ముడు శ్రవణ్ అన్న చితికి నిప్పంటించారు. ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు వాహనంలో వచ్చిన అమృత తండ్రిని చివరి చూపు చూడకుండానే కొన్ని సెకన్ల వ్యవధిలోనే వెను తిరిగింది. మారుతీరావు కుటుంబ సభ్యులు, స్థానికులు అమృత గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కొంచెం సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే ఆమె చివరి చూపు చూడలేకపోయింది.
తన తండ్రి మరణం తర్వాత అమృత సంచలన నిర్ణయం తీసుకుంది. భర్త లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన అమృత ప్రస్తుతం తల్లి విషయంలో బాధపడుతుంది. తన తండ్రి ఆత్మహత్య చేసుకోవడం వల్ల తన తల్లి కూడా ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోననే అమృత భయపడిపోతుందంట. తన తండ్రి చివరి కోరిక మేరకు అమృత తన తల్లి దగ్గరకి వెళ్లనుంది అంట. భర్త ఎలాగో పోయాడు.. తండ్రి కూడా పోయాడు.. ఇక మిగిలింది.. కన్నతల్లి కనుక ఆమెకోసమైనా ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుందంట.
మారుతీ రావు చివరగా రాసిన లెటర్ లో అమృత గురించి ఇలా రాసారు. “తల్లీ అమృత.. అమ్మ దగ్గరికి వెళ్ళిపో”. అని రాసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇంకా చాలా విషయాలు అందులో రాసారు అంట. అమృతను ఎలాగైనా కలవాలని మిర్యాలగూడకు చెందిన వారితో కూడా రాయబారం పంపాడు. కానీ, అమృత మాత్రం ఏమాత్రం మెట్టు దిగలేదు. కూతురు దూరం కావడంతో పాటు కేసులు పెట్టడంతో మనస్తాపానికి గురైనట్లు,దాంతో కూతురు ఇక తన మాట వినదని నిర్ణయించుకోని ఆత్మహత్య విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలుస్తుంది.
తాజాగా అమృత స్పృహ తప్పి పడిపోయారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఆమె నివాసంలో ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూ సమయంలో సోమవారం రాత్రి ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. కుటుంబసభ్యులు అమెను వెంటనే 108 వాహనం ద్వారా స్థానిక ఆసుపత్రికి తరలించారు. అమృత తండ్రి, ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
ప్రణయ్ హత్య కేసు నుండి బయటపడేందుకు మారుతీ రావు ఎన్నో ప్రయత్నాలు చేసారు. ప్రణయ్ హత్యకు సంబంధించి 302 సెక్షన్ తోపాటు ఎస్సీ,ఎస్టీ చట్టం కిందా చార్జిషీటు నమోదైంది. దీంతో ప్రణయ్ అసలు ఎస్సి కాదు అని నిరూపించాలి అనుకున్నాడు మారుతీ రావు. అమృత ప్రణయ్ ఫ్యామిలీని రహస్యంగా ఫొటోలు తీశారు. వాళ్ళు చర్చి కి వెళ్లారు, గుడికి వెళ్ళరు అని ఆధారాలు చూపించాలి అనుకున్నాడు. మతం మారినట్లు ఫొటోల కంటే ఏదైనా పేపర్ ఎవిడెన్స్ ఉంటే బలంగా ఉంటుందని మారుతిరావుకు సూచించినట్లు లాయర్ సుబ్బారెడ్డి చెప్పారు.
మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్న తర్వాత అమృత ని కామెంట్ చేయడం స్టార్ట్ చేసారు కొంతమంది. రెండు చావులకి కారణం అమృత అట? ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఆమె చేసిన తప్పు అంట. ఇంట్లో ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకొని తన మానాన తను బతకడం అమృత చేసిన తప్పా? భర్త ని చంపు అని మారుతి రావు కి చెప్పిందా? ఆత్మహత్య చేసుకో అని తన తండ్రికి చెప్పిందా?
సమాజం,పరువు కష్టంలో ఉన్నప్పుడు నీకు ఎందుకు ఉపయోగ పడవు, వాటి కోసమే బతుకుత అంటే ఎప్పుడో ఒకసారి ఆత్మహత్య చేసుకుంటావు. సమాజం జోహార్ అని చెప్పి పెద్ద కర్మ రోజు బోజనాలు చేసి మర్చిపోతుంది. నిజంగా మారుతీ రావు రియల్ లైఫ్ చూసి అయినా కొంతమంది మారితే బాగుండు.
ఒక్కటి గుర్తుఉంచుకోండి పిల్లలని కనడం మీ చేతిలో ఉంటుంది,వారి ఆలోచనలు మీ చేతిలో ఉండవు.కష్టం వచ్చినప్పుడు ప్రొటెక్షన్ మాత్రమే ఇవ్వగలరు,కానీ కష్టం రాకుండా ఎవరు చేయలేరు. ఒక వేళ అమృత ప్రేమ పెళ్లి నిర్ణయాలు తప్పో ఒప్పో నిర్ణయించడానికి మనం ఎవరం. రాజు పేద కావచ్చు పేద రాజు కావచ్చు. డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు. కులం అంతకంటే కాదు. కులం కోసం ఇంత చేసారు మారుతీ రావు. చివరికి ఏం సాధించారు?