ఆశీర్వదించడానికి, గౌరవించడానికి ఎదుటివారిపై “ఉమ్మేస్తారంట”…ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?

ఆశీర్వదించడానికి, గౌరవించడానికి ఎదుటివారిపై “ఉమ్మేస్తారంట”…ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?

by Mohana Priya

Ads

ఉమ్మడం. ఇది వింటుంటేనే చాలామందికి చిరాగ్గా ఉంటుంది. రోడ్డు మీద మనం నుంచుని ఉంటే చాలామంది ఆలోచించకుండా ఎక్కడపడితే అక్కడ ఉమ్ముతారు. పక్కన మనుషులు ఉన్నారు కూడా పట్టించుకోరు. అలా ఉమ్మే వారికి వాళ్ళు చేసే పని తప్పు అని చెప్పి తిట్టాలి అనిపించినా కూడా చాలామంది నియంత్రించుకుంటారు.

Video Advertisement

కొంతమంది అయితే మామూలుగా కాకుండా గొంతుతో విచిత్రమైన శబ్దాలు చేస్తూ వాంతి చేసుకున్నట్టు ఉమ్ముతారు. ఈ ఎక్స్ప్లనేషన్ చూసి తిట్టుకోకండి. ఇలా నిజంగానే ఉంటారు.

గవర్నమెంట్ ట్రాఫిక్ రూల్స్ తో పాటు ఇలా ఉమ్మడానికి కూడా ఎక్కువ మొత్తంలో ఫైన్ వేస్తే బాగుండు అని అనుకుంటాం. తెలుసా? మనం అంతగా చిరాకు పడే ఉమ్మడం ఒక ఊరిలో సాంప్రదాయం. షాక్ అయ్యారా? ఇది నిజమే. అసలు విషయానికొస్తే కెన్యా, నార్త్ టాంజానియా ప్రాంతంలో ఉండే మసాయి అనే ఒక జాతి ప్రజలు ఉమ్మడాన్ని సాంప్రదాయంగా భావిస్తారు.

ఎవరినైనా పలకరించాలంటే వాళ్ల చేతుల్లో ఉమ్మి తుడుచుకుని తర్వాత అవతలి వారిని పలకరిస్తారట. అప్పుడే పుట్టిన పిల్లలని దీవించాలి అన్నా కూడా వాళ్ళపై ఉమ్ముతారట. అంతే కాకుండా అక్కడ పెళ్లిళ్లు అయినప్పుడు తండ్రి తన కూతురి నుదుటి పై ఉమ్మి ఆశీర్వదిస్తారట.


End of Article

You may also like