మాస్క్ పెట్టుకోమని చెప్పినందుకు ఆ ప్రేమికుల జంట ఇలా చేసారు.

మాస్క్ పెట్టుకోమని చెప్పినందుకు ఆ ప్రేమికుల జంట ఇలా చేసారు.

by Megha Varna

Ads

అనుకోని అతిథిలా వచ్చిన కరోనా కు అందరూ భయపడి ఛస్తున్నారు కానీ కొంతమంది బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటివారికి ప్రభుత్వాలు పక్క వారు మంచి చెబుతున్నా ఎక్కట్లేదు. మంచి చెప్పినప్పుడు ఎక్కకపోయినా పర్లేదు కానీ నాకే చెప్తావా అంటూ తిరిగి దాడి చేస్తున్నారు.

Video Advertisement

తాజాగా ఇలాంటి ఓ ఘటన ఐర్లాండ్‌లో చోటు చేసుకుంది.బెల్జియంలో నివసించే రాబర్ట్ మర్ఫీ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ జంట ఆ బస్ ఎక్కారు.అందులో యువకుడి మొహానికి మాస్క్ ధరించకుండా తనతో ఉన్న అమ్మాయితో కలిసి సరిగ్గా మర్ఫీ ఎదుట కూర్చున్నాడు.

మాస్క్ వేసుకోకుండా తన ఎదురుగా కూర్చున్న కుర్రాడితో మాస్క్ ధరించాలని రాబర్ట్ మర్ఫీ కోరారు.దానికి మనోడు ఒప్పుకోకుండా మర్ఫీ తో గొడవపడ్డాడు.అయినప్పటికీ మర్ఫీ వెనక్కి తగ్గలేదు మాస్క్ వేసుకోమని ఆ యువకుడికి సూచించాడు.మార్ఫీ మాట వినకపోగా నాకే చెబుతావా అంటూ తన చెస్ట్ పై కొరికి తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి బస్ దిగి పారిపోయాడు.ఇక అక్కడ ఉన్నవారు వెంటనే రాబర్ట్ మర్ఫీను హాస్పిటల్ లో చేర్చారు.

సీసీటీవీ ఫూటేజ్ ద్వారా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.పాపం మంచి చెప్పినందుకు రాబర్ట్ మర్ఫీ ను ఎలా కొరికాడో చూడండి.కలికాలం కదా పాపం మంచికి రోజులు లేవు… అంటూ అందరూ కామెంట్ చేస్తున్నారు.


End of Article

You may also like