Ads
ప్రస్తుతం మార్కెట్లో చికెన్ ధరలు అనేవి నిమిషాలు గంటల వ్యవధిలోనే తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఎలా పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో మనం ఊహించలేం.
Video Advertisement
అయితే గత కొన్ని నెలలుగా చికెన్ మార్కెట్ ధర సాధారణంగా కొనసాగింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ధరలు ఆకాశాన్నంటాయి. దాదాపు నలభై శాతం పెరిగింది.
ఢిల్లీ ఎన్ పి ఆర్ మార్కెట్ లో 15 రోజుల కిందట కిలో చికెన్ 180 రూపాయలు ఉంటే రిటైల్ ధర ప్రస్తుతం 260 చేరింది. ఇక ఆన్లైన్లో బుక్ చేసుకునే వారైతే కిలోకి 320 రూపాయల నుంచి 340 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. గత 15 రోజులుగా హోల్సేల్ మార్కెట్ లో చికెన్ ధరలు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో పౌల్ట్రీ వ్యాపారం దెబ్బతింది.
ఈ ప్రభావం ధరలపై కనిపిస్తోందని వ్యాపారస్తులు చెబుతున్నారు. అందుకే 15 రోజులుగా హోల్సేల్ మార్కెట్ లో చికెన్ కొరత ఏర్పడిందని దీనిద్వారా ధరలు పెరిగాయని అంటున్నారు. గత రెండు వారాల ముందు ధర 180 రూపాయల నుంచి 200 రూపాయలకు ధర అందుబాటులో ఉండేదన్నారు.
కానీ ప్రస్తుతం దీని ఖర్చు మార్కెట్ ధరలు 200 వరకు రావడంతో వ్యాపారస్తులు 250 నుంచి 2020 వరకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ఇలా రోజురోజుకు ధర పెరుగుతూ, ఢిల్లీలో కిలో చికెన్ ధర 245 రూపాయల నుండి 270 వరకు ఉన్నది. ఇక ఆన్లైన్లో మాత్రం ధర దాదాపు కిలోకి 350 పైనే ఉంది.మళ్లీ ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయో, చికెన్ ప్రియులకు శుభవార్త ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.
End of Article