Ads
తమిళ్ స్టార్ హీరో విజయ్ కి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలుసు. విజయ్ సినిమాలు కూడా తమిళ్ లో రిలీజ్ అయిన డేట్ కే తెలుగులో కూడా రిలీజ్ అవుతాయి. అలా ఇటీవల విడుదలైన సినిమా మాస్టర్. మాస్టర్ సినిమా థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కూడా సూపర్ హిట్ గా దూసుకుపోతోంది. ఈ సినిమాని జనవరి 29 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.
Video Advertisement
అయితే ఈ సినిమాలో జరిగిన ఒక చిన్న పొరపాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, సినిమాలో హీరో జువినైల్ సెంటర్ కి టీచర్ గా వెళ్తారు. కొన్ని సంఘటనల వల్ల హీరో తర్వాత అక్కడ ఉండే వారిపై సీరియస్ గా దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఒక సందర్భంలో విలన్లతో కబడ్డీ ఉండగా, భయంతో ఒక అబ్బాయి ఒకచోట కూర్చొని ఉంటాడు. అప్పుడు విజయ్ అక్కడికి వస్తారు. విజయ్ వెనకాల గోడమీద ఉన్న ఒక బోర్డ్ పై ఇలా రాసి ఉంటుంది.
పైన కనిపించేది అదే సీన్. ఆ వెనకాల ఉన్న బోర్డ్ మీద రాసి ఉన్న సెంటెన్స్ మీకు అర్థమవుతోందా? “ఉంటుంది” అనే ఒక్క పదం తప్ప దాని మీద ఉన్న మిగిలిన పదాలు అన్ని కొంచెం కొత్తగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు కింద ఉన్న ఫోటో చూడండి.
ఇది ఆ సీన్ మొదలయ్యే ముందు ఆ అబ్బాయి కూర్చుని ఉండే షాట్. ఇందులో చూస్తే “అందం అనేది నడవడికలో ఉంటుంది ఆడంబరాలలో కాదు” అని రాసి ఉన్నట్టు తెలుస్తోంది.
ఇది హీరో ఎంటర్ అయిన తర్వాత షాట్. ఇందులో కూడా సెంటెన్స్ కరెక్ట్ గానే రాసి ఉంటుంది. ఇలా ఈ ఒక్క సినిమాలో మాత్రమే కాదు చాలా సినిమాలో జరుగుతూనే ఉంటాయి. కానీ వీటివల్ల సినిమాకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ప్రేక్షకులు కూడా అంత పెద్దగా పట్టించుకోరు. కానీ ప్రస్తుతం ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి దీనిపై ఇలా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
End of Article