Ads
సికింద్రాబాద్ లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరు ఎదురు చూసే కీలక ఘట్టం అయిన రంగం కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. తెలంగాణ ప్రజల భవిష్యత్ గురించి చెప్పే భవిష్యవాణిని మాతంగి స్వర్ణలత వినిపించారు. పచ్చి కుండ పై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు
Video Advertisement
ఈ సంవత్సరం అగ్ని ప్రమదాల గురించి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కొంచెం ఆలస్యమైనా వర్షాలు పడుతాయని స్వర్ణలత తెలిపారు. ప్రజలంతా ఎలాంటి భయందోళనకు గురి కావద్దని చెప్పారు.
రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్తూ, ‘ఈ సంవత్సరం లోపం లేకుండా పూజలు అందుకుని, సంతోషంగా ఉన్నాను. కొంచెం ఆలస్యం అయినా వర్షాలు పడతాయని, అగ్ని ప్రమాదాలు జరుగుతాయని, భయపడవద్దని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. 5 వారాల పాటు ముత్తైదులందరూ నన్ను భక్తిశ్రద్ధలతో పూజించుకోవాలి. నా దగ్గరికి వచ్చిన వారిని క్షేమంగా చుసుకునే భారం నాది. అయిదు వారాల పాటు సాక పోయండి. టెంకాయలను కొట్టి, నైవేద్యాలను సమర్పించాలి.
గతేడాది నాకు మాటిచ్చి ఎందుకు మరిచిపోయారు. మీకు కావాల్సిన బలాన్ని ఇచ్చాను. మీతోనే ఉంటాను. ఏది బయట పెట్టాలో ఏది బయటపెట్టకూడదో నాకు మాత్రమే తెలుసు. అన్నిటినీ కడుపులో దాచుకుంటాను’ అని స్వర్ణలత పేర్కొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రంగం కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యవాణి వినడం కోసం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. రంగం కార్యక్రమం ముగిసిన తర్వాత మంత్రి శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
బోనాల వేడుకలో భాగంగా ఉజ్జయిని మహంకాళి గుడికి లక్షలాది మంది భక్తులు వచ్చారని, రాత్రీ సమయంలో కూడా దర్శనాలు జరిగాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అనేక పార్టీల నాయకులు ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని దర్శించుకున్నారని వెల్లడించారు. భవిష్యవాణిలో అమ్మవారు బోనాలు వేడుక బాగా జరిగిందని చెప్పడం ఆనందకరం అని తెలిపారు. రంగం భవిష్యవాణి నేపథ్యంలో ఆలయంలో భక్తులకు మహంకాళి అమ్మవారి దర్శనం నిలిపివేశారు.
Also Read: అంతటి గొప్ప రాజు అయిన రావణుడు… ఇలా రాక్షసుడిగా ఎందుకు మారాడు..? అసలు ఏం జరిగింది..?
End of Article